తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagananna Vidya Deevena: నేడు పామర్రులో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల.. బహిరంగ సభలో పాల్గొననున్న సిఎం జగన్

Jagananna Vidya Deevena: నేడు పామర్రులో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల.. బహిరంగ సభలో పాల్గొననున్న సిఎం జగన్

Sarath chandra.B HT Telugu

01 March 2024, 7:56 IST

google News
    • Jagananna Vidya Deevena: ఏపీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44లక్షల మంది విద్యార్ధులకు నేడు జగనన్న విద్యాదీవెన నిధులను సిఎం జగన్ కృష్ణాజిల్లా పామర్రులో విడుదల చేయనున్నారు. 
నేడు పామర్రులో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
నేడు పామర్రులో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల (twitter)

నేడు పామర్రులో జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల

Jagananna Vidya Deevena: ఏపీలో నేడు జగనన్న విద్యా దీవెన నిధులను విద్యార్ధులకు ఖాతాలకు జమ చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన నిధులను విద్యార్ధి తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.

జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి YS Jagan కృష్ణాజిల్లా పామర్రులో జరిగే బహిరంగ సభలో తల్లులు, విద్యార్థుల జాయింట్‌ ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను జమ చేయనున్నారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

పేద విద్యార్థులకు ఉన్నత చదువులు భారంగా మారకూడదనే ఉధ్దేశంతో ఫీజు రియింబర్స్‌మెంట్‌ Reimbursement పథకాలను అందిస్తున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగాఏపీ ప్రభుత్వం చెల్లిస్తోంది.

ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి స్కాలర్‌షిప్ ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వీటితో పాటు భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెనను అందిస్తున్నారు.

ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో వసతిదీవెన ఫీజులను రియింబర్స్ చేస్తున్నారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసిందని చెబుతున్నారు.

శుక్రవారం ఉదయం 10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయల్దేరి 10.30 గంటలకు పామర్రుకు చేరుకుంటారు. 10.50 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ముందుగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. సభానంతరం స్థానిక పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మ.1.55కు తాడేపల్లి చేరుకుంటారు.

రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో 93 శాతం మంది విద్యార్థులు "విద్యా దీవెన" ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకుంటూ చదువుకుంటున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం చదువులను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తుందో ఇట్టే గమనించవచ్చని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

తదుపరి వ్యాసం