Jagananna VidyaDeevena: నేడు నగరిలో జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల
Jagananna VidyaDeevena: జగనన్న విద్యా దీవెన పథకం నిధులను నేడు నగరిలో సిఎం జగన్ విడుదల చేయనున్నారు. కాలేజీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్ చేసే పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది.
Jagananna VidyaDeevena: జగనన్న విద్యా దీవెన పథకం నిధులన సిఎం జగన్ నేడు విడుదల చేయనున్నారు. కాలేజీ విద్యార్ధులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నారు. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజులను ఆ త్రైమాసికం అయిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాలకు చెల్లిస్తున్నారు.
ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసికానికి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 680.44 కోట్లను సోమవారం చిత్తూరు జిల్లా, నగరిలో 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు నేరుగా జమ చేయనున్నారు.
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న లక్ష్యంతో ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి చెల్లించేలా పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఫీజురియంబర్స్‌మెంట్‌తో పాటు 'జగనన్న వసతి దీవెన' పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికి వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ మరియు వసతి సౌకర్యాలను అందిస్తూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్ లో మార్పులు చేసి నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు అందిస్తున్నారు. విద్యార్థులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు, కరిక్యులమ్ లో భాగంగా ఆన్లైన్ వర్టికల్స్ అందిస్తున్నారు. దీని వల్ల విద్యార్థులు తాము చదువుతున్న కోర్సులతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఆన్ లైన్ లో నేర్చుకునే వెసులుబాటు లభిస్తోంది.
కోర్సు కరిక్యులమ్ లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్ షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు వీలవుతోంది. ఒకే విద్యా సంవత్సరంలో 3 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. Microsoft లో 1.27 లక్షల మంది, Salesforce లో 33,000, AWS లో 24,000, Nasscomలో 20,000. Palo Alto లో 10,000, Data Analytics లో 15,442, Cyber Security లో 12,709, Process Miningలో 10 వేల మందికి సర్టిఫికేషన్స్ పొందారు.
ఏపీలో ఇంటర్ పాసై పై చదువులకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018-19 లో 81, 813 కాగా జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022-23 నాటికి కేవలం 22,387 కు చేరింది. 2022-23 నాటికి ఇంటర్ పాసై పై చదువులకు పోలేని విద్యార్థుల జాతీయ సగటు 27% కాగా, ఏపీలో కేవలం 6.62% మాత్రమే ఉంది.
2018-19 సంవత్సరంలో 32.4 శాతంగా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి(GER), రాష్ట్రంలో GER 80% కి తీసుకెళ్లటానికి అన్నిచర్యలు చేపట్టింది.
2018-19లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే, బాలికలకు ఉన్నత విద్యను దగ్గర చేస్తూ. 2020-21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది.
2018-19లో 37,000 గా ఉన్న క్యాంపస్ ప్లేస్ మెంట్స్ గణనీయంగా పెరిగి 2022-23 నాటికి లక్షకుపైగా చేరింది. డిగ్రీ కోర్సులో 2వ సెమిస్టర్ నుంచి Al, loT. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రియల్ ఎస్టేట్ మేనేజ్ మెంట్, లాజిస్టిక్స్, రిస్క్ మేనేజ్ మెంట్ స్టాక్ ఎక్సెంజ్, సైబర్ ఫోరెన్సిక్స్, ఫైనాన్సియల్ మార్కెట్స్ తదితర మైనర్ కోర్సులు ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్ పాఠ్యపుస్తకాలు అందిస్తున్నారు. 400కు పైగా ద్విభాషా పాడ్ క్యాస్ట్ లు అందుబాటులోకి తెచ్చారు.
నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, సెక్టార్ స్కిల్ కౌన్సిల్ లతో ఒప్పందం చేసుకునపి 50 బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ప్రోగ్రామ్ లతోపాటు 159 సింగిల్ మేజర్ కోర్సులు ప్రవేశపెట్టారు.