CM Jagan: డియర్ హర్ష.. నిన్ను చూసి గర్వపడుతున్నాను - కుమార్తెపై సీఎం జగన్ ట్వీట్
02 July 2022, 19:51 IST
- cm jagan tweet: తన ఫ్యామిలీకి సంబంధించి ఓ ట్వీట్ చేశారు సీఎం వైఎస్ జగన్ . తన కుమార్తె గ్రాడ్యూయేషన్ పూర్తి అయిన సందర్భంగా వర్శిటీలో నిర్వహించిన కార్యక్రమంలో భార్య భారతితో కలిసి ఆయన పాల్గొన్నారు.
కుమార్తెతో సీఎం జగన్ దంపతులు
cm jagan tweet about his daughter: ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పెద్దకుమార్తె హర్ష పారిస్‌లోని ప్రఖ్యాత బిజినెల్ స్కూల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.ఇందుకు సంబంధించి క్యాంపస్‌లో జరిగిన కాన్వొకేషన్ కార్యక్రమంలో భార్య భారతితో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి ట్వీట్ చేశారు.
'డియర్ హర్ష.... నీ ఎదుగుదలను చూసి గర్వపడుతున్నాను.దేవుడు ఎంతో దయ చూపాడు. ఇన్సీడ్ నుంచి టాప్ గ్రేడ్ లో గ్రాడ్యూయేషన్ పట్టా పొందటం చూసి చాలా గర్వపడుతున్నాను' అంటూ జగన్ ట్వీట్ చేశారు.
తన కుమార్తె స్నాతకోత్సవానికి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ ఇటీవలే నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే జగన్ పారిస్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని, ఆయన విదేశాలకు వెళ్తే కేసుల విచారణ ఆలస్యం అవుతుందని కోర్టుకు తెలిపారు. అయితే సీబీఐ అధికారుల వాదనను తోసిపుచ్చిన కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌లో పర్యటనకు వెళ్లొచ్చని ఆదేశాలిచ్చింది. అయితే పారిస్ పర్యటన వివరాలను సీబీఐ అధికారులతో పాటు కోర్టుకు కూడా సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో పాటు కలిసి పారిస్ వెళ్లారు.
మే నెలలో అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటిలో బ్యాచ్ లర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తిచేసుకున్న షర్మిల తనయుడు రాజారెడ్డి కూడా డిగ్రీ పట్టా అందుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి షర్మిలతోపాటు ఆమె భర్త అనిల్ కుమార్, తల్లి విజయమ్మ, కూతురు అంజలి రెడ్డి హాజరయ్యారు.
టాపిక్