తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan : ఆ తేదీలోపు రోడ్ల మరమ్మతులు, బ్రిడ్జిలు, ఆర్​వోబీలు పూర్తి చేయాలి

CM Jagan : ఆ తేదీలోపు రోడ్ల మరమ్మతులు, బ్రిడ్జిలు, ఆర్​వోబీలు పూర్తి చేయాలి

HT Telugu Desk HT Telugu

21 June 2022, 16:40 IST

google News
    • ఏపీలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. పనులు ఎక్కడా పెండింగ్ లో ఉండకూడదని చెప్పారు.
సీఎం జగన్
సీఎం జగన్

సీఎం జగన్

రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులపై సీఎం జగన్‌ సమీక్షించారు. పనులు ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన పనులు ఎక్కడా కూడా పెండింగ్‌లో ఉండకూడదన్నారు. వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకొని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వచ్చే రోజుల్లో ఫలితాలు కచ్చితంగా కనిపించాలన్నారు. గుంతలు లేకుండా రోడ్లను తీర్చిదిద్దాలన్నారు.

నివర్‌ తుపాను కారణంగా కొట్టుకుపోయిన ప్రాంతాల్లో కొత్త బ్రిడ్జిల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు చేపట్టాలన్నారు. కార్పొరేషన్లు, మున్పిపాల్టీల్లో జులై 15 కల్లా గుంతలు పూడ్చాలని చెప్పారు. జూలై 20న ఫొటో గ్యాలరీలు పెట్టాలన్నారు. పంచాయతీ రాజ్‌ రోడ్లకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పనులే కాకుండా, క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు.

రోడ్ల మరమ్మతులు, బ్రిడ్జిలు, ఆర్​వోబీల నిర్మాణాలను వచ్చే నెల 15 లోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. రోడ్ల మరమ్మతులకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారన్నారు. పురపాలక శాఖ పరిధిలోని 4 వేల పై కిలో మీటర్లు జూలై 15 లోపు పూర్తి చేయాలని సీఎం చెప్పినట్టు ఆదిమూలపు సురేశ్ అన్నారు. రాష్ట్రంలో 27 వేల కిలో మీటర్లకు పైగా పంచాయతీ రోడ్లను శాచురేషన్ పద్ధతిలో అభివృద్ది చేయాలని తెలిపారు.

 

తదుపరి వ్యాసం