తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Raithu Bharosa: కౌలు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సిఎం జగన్

Ysr Raithu Bharosa: కౌలు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసిన సిఎం జగన్

HT Telugu Desk HT Telugu

01 September 2023, 12:32 IST

google News
    • Ysr Raithu Bharosa: అధికారంలోకి వచ్చిన యాభై నెలల్లో రాష్ట్రంలోని 52.50లక్షల మంది రైతులకు 31వేల కోట్ల రుపాయలను రైతు భరోసా పథకం ద్వారా అందించినట్లు సిఎం జగన్ చెప్పారు. పిఎం కిసాన్‌ వైఎస్సార్‌ రైతు భరోసా నిధులను తాడేపల్లి నుంచి సిఎం జగన్ విడుదల చేశారు. 
రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం జగన్
రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం జగన్

రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం జగన్

Ysr Raithu Bharosa: అధికారంలోకి వచ్చిన 50నెలల్లో రాష్ట్రంలోని 52.50లక్షల మందికి 31వేల కోట్ల రుపాయలను పిఎం కిసాన్‌ వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా అందించినట్లు సిఎం జగన్‌ చెప్పారు.

రాష్ట్రంలో అర హెక్టారులోపు 1.25ఎకరాల్లోపు ఉన్న రైతులు 60శాతం మంది ఉన్నారని సిఎం జగన్ చెప్పారు. రైతుల్లొ రెండున్నర ఎకరాల్లోపు ఉన్న వారు 70శాతం వరకు ఉన్నారని చెప్పారు. రూ.13,500 పెట్టుబడి సాయం అరవై శాతం రైతులకు 80శాతం పంటలకు 80శాతం పెట్టుబడి సహాయంగా ఉపయోగ పడుతుందని చెప్పారు.

రైతు భరోసాతో బయట అప్పులు చేయాల్సిన అవసరం రైతులకు రాదని చెప్పారు.రైతులకు సమయానికి తగ్గట్టుగా డబ్బులు అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో నష్టపోకుండా ఉండే పరిస్థితి రైతు భరోసా ద్వారా నాలుగేళ్లుగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. పిఎం కిసాన్, రైతు భరోసా కార్యక్రమం ద్వారా 70శాతం రైతులకు ఎంతో మేలు చేస్తోందన్నారు.

ఇన్‌ఫుట్‌ సబ్సిడీల్లో కూడా ఇలాంటి మంచి జరుగుతోందన్నారు. వర్షాల వల్ల గోదావరి వరదలు కూడా వచ్చాయన్నారు. సీజన్‌ ముగిసే 4879హెక్టార్లలో రకరకాల పంటలు నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా 11కోట్ల రుపాయలు సమయానికి అందిస్తున్నట్లు చెప్పారు. ఏ సీజన్‌లో నష్టపోతే అదే సీజన్‌లో అందిస్తున్నామన్నారు.

రూ. 1977కోట్లను నాలుగేళ్లలో ఇన్‌పుట్‌ సబ్సిడీగా రైతులకు అందించినట్లు సిఎం చెప్పారు. గోదావరి వరదల్లో నష్టపోయిన వారికి 11కోట్లను ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు రూ.38కోట్లను వరద సహాయక పరిహారంగా అందించినట్లు చెప్పారు. వరదలతో నష్టపోయిన రైతులు, నాట్లు వేసిన వారందరికి వెనువెంటనే పంటలు వేసుకునేలా ఆర్బీకేల ద్వారా వరి విత్తనాలు అందిస్తున్నట్లు చెప్పారు. రైతుల పక్షపాత ప్రభుత్వంగా విప్లవాత్మక మార్పులు చూడగలిగామన్నారు.

ప్రతి గామంలో గతంలో లేని విధంగా ఆర్బీకే వ్యవస్థను ఏర్పాట్లు చేశామని 10,778ఆర్బీకేలు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్నారని చెప్పారు. బ్యాంకింగ్ సేవలు, కియోస్క్‌ల ద్వారా కల్తీ లేని విత్తనాలు అందిస్తున్నామని, ఈ క్రాప్ నమోదు చేసి ఏ ఎకరాలో ఏ పంట వేశారనేది కూడా నమోదు చేస్తున్నామన్నారు. సోషల్ ఆడిట్‌లో జాబితాలు మొత్తం ప్రత్యక్షమవుతున్నాయని చెప్పారు.

పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఆర్బీకేలతో గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రైతుకు సహాయంగా పంట కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెస్పీతో పాటు రైతులకు బోనస్‌లు కూడా చెల్లించే ప్రభుత్వం తమదన్నారు. మొట్టమొదటి సారి పంట నష్టపోయిన అదే సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీగా ఇస్తున్నామని చెప్పారు.

ప్రతి ఎకరాకు ఇన్స్యూరెన్స్ వచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఉచితంగా పంటల భీమా, పగటిపూట 9గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. అధికారంలోకి రాకముందు పగటి పూట ఇవ్వలేమని, రూ.1500 కోట్లతో ఫీడర్లు అప్డేట్‌ చేయాలని చెప్పినా చేయలేదని, వాటిని ఆధునీకరించి పగలే విద్యుత్ అందిస్తున్నామని జగన్ వివరించారు.

కౌలు రైతులకు ఆర్ధిక సాయం..

కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న సాగుదారులతో కలిపి రైతులందరికి అందిస్తోన్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకం నిధులను శుక్రవారం సిఎం జగన్ విడుదల చేశారు. 2023-24 సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయాన్ని గురువారం విడుదల చేయాల్సి ఉండగా అది శుక్రవారానికి వాయిదా పడింది.

వై యస్ ఆర్ రైతు భరోసా- పి యం కిసాన్ పథకము 2023 - 24 లో భాగంగా రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. రైతులకు ఆర్ధిక చేయూత అందించడానికి 15 అక్టోబర్ , 2019 నుండి వై.యస్.ఆర్ రైతు భరోసా - పి . యం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నారు.

అర్హులైన భూ యజమాని కుటుంబాలను లబ్దిదారులుగా గుర్తించి వారికి మొదటి విడత రూ. 7500/- మే నెలలో (పి.యం.కిసాన్ లబ్దిరూ. 2000/- లను కలిపి చెల్లిస్తున్నారు. రెండవ విడత రూ. 4000/- అక్టోబర్ నెలలో (పి.యం.కిసాన్ లబ్దిరూ. 2000/- లను కలిపి అందిస్తున్నారు. మూడవ విడత రూ. 2000/- ప్రత్యేకంగా పి.యం.కిసాన్ లబ్దిని జనవరి నెలలో అందిస్తున్నారు.

రాష్ట్రంలో భూమి లేని షెడ్యూల్ తెగలు , షెడ్యూల్ కులము, వెనకబడిన కులాలు మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతు కుటుంబాలకు , దేవాదాయ భూములు మరియు అటవీ భూమి సాగుదారులకు సంవత్సరానికి రూ. 13,500/- చొప్పున ఆర్ధిక సహాయం 3 విడతలలో రైతుల ఖాతాలలోనికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో అందిస్తున్నారు.

వీరికి మొదటి విడత రూ. 7500/- లబ్దిని మే నెలలో చెల్లిస్తున్నారు. రెండవ విడత రూ. 4000/- లబ్దిని అక్టోబర్ నెలలో చెల్లిస్తున్నారు. మూడవ విడత రూ. 2000/- లబ్దిని జనవరి నెలలో అందజేస్తున్నారు.

పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున నేడు రూ.109.74 కోట్లు సాయం పంపిణీ చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు.

ఏటా మూడు దఫాల్లో..

రాష్ట్రంలో భూ యజమానులకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తోంది.

మరోవైపు దేశంలో ఎక్కడా లేనివిధంగా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవదాయ, అటవీ భూమి సాగుదారులకు కూడా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అందచేస్తోంది.

ఐదో ఏడాది తొలి విడతగా తాజాగా అందచేస్తున్న సాయంతో కూడా కలిపితే ఇప్పటివరకు 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు, 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు (ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాదారులు) మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. ఇక మొత్తంగా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని వైఎస్సార్ రైతు భరోసా ద్వారా చెల్లించారు.

తదుపరి వ్యాసం