తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn On Pensions: సామాజిక పింఛన్ల తనిఖీ జరపండి..అర్హులకే పింఛన్లు అందాలన్న సీఎం చంద్రబాబు

CBN On Pensions: సామాజిక పింఛన్ల తనిఖీ జరపండి..అర్హులకే పింఛన్లు అందాలన్న సీఎం చంద్రబాబు

24 December 2024, 5:00 IST

google News
    • CBN On Pensions: ఏపీలో సామాజిక పెన్షన్ల తనిఖీ వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారుల్ని ఆదేశించారు.  దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లలో పెద్ద ఎత్తున అనర్హులు ఉన్నట్టు గుర్తించిన నేపథ్యంలో  అర్హులకు మాత్రమే పెన్షన్లను అందించాలని స్పష్టం చేశారు. 
అనర్హులకు పెన్షన్లను తొలగించాలని సీఎం ఆదేశాలు
అనర్హులకు పెన్షన్లను తొలగించాలని సీఎం ఆదేశాలు

అనర్హులకు పెన్షన్లను తొలగించాలని సీఎం ఆదేశాలు

CBN On Pensions: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనేక మంది అనర్హులు ఉన్నారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనర్హులకు పెన్షన్లను తొలగించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలతో పాటు అధికారుల నివేదికల్లో అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయని తేలిన నేపథ్యంలో పింఛన్ల తనిఖీని పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టారు.

రాష్ట్రంలో అర్హులైన వారు అందరికీ పింఛన్లు, పథకాలు అందాలన్నది తమ ఉద్దేశమని...ఇదే సమయంలో అనర్హులకు ఫించన్లు ఇవ్వడం సరికాదని ముఖ‌్యమంత్రి స్పష్టం చేశారు. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయం తేలాలంటే నిర్థిష్టమైన నిబంధనలు అమలవ్వాలన్నారు.

అనర్హులను తొలగించేందుకు పూర్తి స్థాయిలో పింఛన్ల తనిఖీ చేపట్టాలన్నారు. పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని కొందరు పింఛన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని...దీనిపై అర్హులైన వారు ఆందోళన పడాల్సిన పనిలేదని సీఎం భరోసా ఇచ్చారు. అర్హులకే సాయమనేది తమ విధానమని సీఎం చెప్పారు.

మూడునెలల్లో దివ్యాంగుల పింఛన్లపై తనిఖీలు పూర్తి చెయ్యాలని...తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చే డాక్టర్లు, అధికారులు, సిబ్బందిపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఒక సారి తప్పుడు సర్టిఫికెట్ ఇస్తే....ఎప్పటికైనా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

రూ.15,000 పెన్షన్ తీసుకుంటున్న 24 వేల మంది ఇంటికెళ్లి పరిశీలించాలని..వారు ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం సూచించారు. తప్పుడు సర్టిఫికెట్లతో ప్రభుత్వాన్ని మోసం చేస్తే సహించేది లేదన్నారు.

బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ సూచనలపై కసరత్తు

బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టారు. అందరికీ ఇచ్చేలా పథకాలు ఇస్తూనే.....వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా లబ్ధి జరిగేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన సూచనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లు

రాష్ట్రంలో త్వరలో ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. స్కిల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్, సోషల్ ఎమోషనల్ స్కిల్స్, నైతిక విలువలు, నీతిశాస్త్రం, డిజిటల్ లిటరసీ, లీగల్ అవేర్నెస్ వంటివి ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు అందించనున్నారు. 26 జిల్లాల్లోని 104 బీసీ హాస్టళ్లలో పైలట్ ప్రాజెక్టులుగా దీన్ని అమలు చేయనున్నారు. త్వరలోనే ఈ సెంటర్లను ప్రభుత్వం బీసీ విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది.

తదుపరి వ్యాసం