HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : వరదల్లో నష్టపోయిన ఇల్లు, షాపు రెండింటికీ ఆర్థిక సాయం- స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : వరదల్లో నష్టపోయిన ఇల్లు, షాపు రెండింటికీ ఆర్థిక సాయం- స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు

17 September 2024, 21:36 IST

    • CM Chandrababu : విజయవాడ వరదల్లో నష్టపోయిన వారికి సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఇంటికీ రూ.25 వేలు, ఫస్ట్ ఫ్లోర్ ఆ పై ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు, మత్స్యకారులు, పశునష్టం ఇలా అన్ని వర్గాలకూ ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
వరదల్లో నష్టపోయిన ఇల్లు, షాపు రెండింటికీ ఆర్థిక సాయం- స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు
వరదల్లో నష్టపోయిన ఇల్లు, షాపు రెండింటికీ ఆర్థిక సాయం- స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు

వరదల్లో నష్టపోయిన ఇల్లు, షాపు రెండింటికీ ఆర్థిక సాయం- స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : విజయవాడ వరదలలో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన... బాధితులకు అందించే ఆర్థిక సాయం వివరాలు ప్రకటించారు. విజయవాడ వరదల్లో గ్రౌండ్ ఫ్లోర్ లో మునిగిపోయిన ప్రతి ఇంటికీ ఏపీ ప్రభుత్వం రూ.25 వేల ఆర్ధిక సాయం అందిస్తుందని ప్రకటించారు. ఫస్ట్ ఫ్లోర్ ఆ పైన ఉన్న ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తుందన్నారు. విజయవాడ కాకుండా, వరదల వల్ల ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇస్తామన్నారు. గతంలో కేవలం రూ.2 వేలు మాత్రమే ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని రూ.10 వేలకు పెంచుతున్నామన్నారు.

ఇల్లు, షాపు రెండింటికీ ఇస్తాం

"విజయవాడ వరదల్లో నష్టపోయిన చిరు వ్యాపారులకు, చిన్న చిన్న షాపులు ఉండే వారికి రూ.25 వేల ఆర్థిక సాయం చేస్తున్నాం. ఇల్లు మునిగిపోతే ఇంటికి ఇస్తాం, షాపుకి ఇస్తాం. రెండిటికీ ఇస్తాం. ఎంఎస్ఎంఈలకు మూడు క్యాటగిరీలుగా ఆర్థిక సాయం చేస్తాం. టర్న్ ఓవర్ రూ.40 లక్షల లోపు ఉంటే రూ.50 వేలు, రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే రూ.లక్ష, రూ.1.5 కోట్ల టర్న్ ఓవర్ పైబడి ఉంటే, రూ.1.5 లక్షలు ఇస్తాం. వరదల్లో నష్టపోయిన 2 వీలర్స్ కి రూ.3 వేలు, ఆటోలకి రూ.10 వేలు ఇస్తాం, తోపుడు బళ్లు ఎంత రేటు అయినా కొత్తవి కొనిస్తాం. వరదల్లో నష్టపోయిన ప్రతి చేనేత కార్మికులకి రూ.25 వేలు అందిస్తాం"- సీఎం చంద్రబాబు

మత్స్యకారులను ఆదుకుంటాం

వరదల్లో నష్టపోయిన మత్స్యకారులని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫిషింగ్ బోట్, నెట్ పాక్షికంగా దెబ్బ తింటే రూ.9 వేలు, పూర్తిగా డ్యామేజ్ అయితే రూ.20 వేలు సాయం అందిస్తామన్నారు. పశునష్టం జరిగిన వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక్కో కోడికి రూ.100, పశువులకు రూ.50 వేలు, ఎద్దులకు రూ.40 వేలు. దూడలకు రూ.25 వేలు, గొర్రెలకు రూ.7500 అందిస్తామన్నారు. షెడ్డు ధ్వంసమైతే రూ.5 వేలు, ఎడ్ల బండ్లు కోల్పోయిన వారికి కొత్తవి అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

రైతులకు ఆర్థిక సాయం

వరదల్లో నష్టపోయిన రైతులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. హెక్టార్‌ వరికి రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేలు, హెక్టార్‌ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు, హెక్టార్‌ చెరకు రూ.25 వేలు, హెక్టార్‌ పొగాకుకు రూ.15 వేలు, హెక్టార్‌ మొక్కజొన్న, రాగికి రూ.15 వేలు ఆర్థికసాయం ఇస్తామన్నారు. హెక్టార్‌ సోయాబీన్‌, పొద్దుతిరుగుడుకు రూ.15 వేలు, జనపనార, కొర్రలు, సామలకు రూ.15 వేలు, పసుపు, అరటికి రూ.35 వేల చొప్పున ఆర్థికసాయం చేస్తామన్నారు. కూరగాయలకు రూ.25 వేలు, మిరపకు రూ.35 వేలు, బొప్పాయికి రూ.25 వేలు, టమాటాకు రూ.25 వేలు, జామకు రూ.35 వేలు, పూలకు రూ.25 వేలు సాయం అందిస్తామన్నారు.

అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే సహించమని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి వరదల్లో మునిగిపోతుందని వైసీపీ విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. చెన్నై, ముంబయితో పాటు చాలా నగరాల్లో వరదలు వచ్చాయని, వాటిని మార్చేశారా? అని ప్రశ్నించారు. బెంగ‌ళూరు, ముంబయి, హైద‌రాబాద్ ను కూడా మార్చేయి అంటూ వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు. రాజ‌కీయాల కోసం తిన్నింటి వాసాలు లెక్క పెడ‌తారా? రాష్ట్రంలో విషం క‌క్కుతారా? అని ఫైర్ అయ్యారు. 5 ఏళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడని వాళ్లు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడేది టీడీపీనే అన్నారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్