HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anganwadi Jobs : ఏపీలో అంగ‌న్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, దర‌ఖాస్తుకు చివ‌రి తేదీ జులై 19

Anganwadi Jobs : ఏపీలో అంగ‌న్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, దర‌ఖాస్తుకు చివ‌రి తేదీ జులై 19

HT Telugu Desk HT Telugu

03 July 2024, 16:14 IST

    • Anganwadi Jobs : చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 87 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన వారు జులై 19 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపిలో అంగ‌న్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, దర‌ఖాస్తుకు చివ‌రి తేదీ జులై 19
ఏపిలో అంగ‌న్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, దర‌ఖాస్తుకు చివ‌రి తేదీ జులై 19

ఏపిలో అంగ‌న్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, దర‌ఖాస్తుకు చివ‌రి తేదీ జులై 19

Anganwadi Jobs : చిత్తూరు జిల్లాలో అంగ‌న్‌వాడీ ఉద్యోగాల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల అయింది. ఇందులో అంగ‌న్‌వాడీ వ‌ర్కర్లు, మినీ అంగ‌న్ వాడీ వ‌ర్కర్లు, అంగ‌న్‌వాడీ హెల్పర్ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. చిత్తూరు జిల్లాలో ఐసీడీఎస్ పీడీ నాగ‌శైల‌జ నోటిఫికేష‌న్ వివ‌రాలు వెల్ల‌డించారు. క‌లెక్టర్ ఆదేశాల మేర‌కు ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నామ‌ని అన్నారు.

చిత్తూరు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగ‌న్‌వాడీ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 87 ఖాళీలను భ‌ర్తీ చేయ‌నున్నారు. అందులో అంగ‌న్‌వాడీ వ‌ర్కర్‌ పోస్టులు 11 ఉండ‌గా, మినీ అంగ‌న్ వాడీ వ‌ర్కర్ పోస్టులు 18, అంగ‌న్‌వాడీ హెల్పర్ పోస్టులు 58 ఉన్నాయి. అర్హులైన వారు జులై 19 లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ జూలై 4 (గురువారం) నుంచి జులై 19 (శుక్రవారం) వ‌ర‌కు ఉంటుంది. ద‌ర‌ఖాస్తును ఆఫ్‌లైన్‌లోనే స్వీక‌రిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన వివ‌రాలు

  • రిక్రూట్‌మెంట్ ప్రక‌ట‌న : ఐసీడీఎస్‌, చిత్తూరు జిల్లా
  • ఉద్యోగాలు : అంగ‌న్‌వాడీ పోస్టులు
  • మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 87 (అంగ‌న్‌వాడీ వ‌ర్కర్‌-11, మినీ అంగ‌న్‌వాడీ వ‌ర్కర్-18, అంగ‌న్‌వాడీ హెల్పర్‌-58)
  • అర్హత : ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణత అయి ఉండాలి. స్థానిక ప్రాంత ప‌రిధికి చెందిన మ‌హిళ అయి ఉండాలి.
  • క‌నీస వ‌య‌స్సు : 21 సంవ‌త్సరాలు
  • గ‌రిష్ట వ‌య‌స్సు : 35 సంవ‌త్స‌రాలు
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల‌కు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు నిండిన‌వారు లేక‌పోతే, 18 ఏళ్ల నిండిన వారిని కూడా తీసుకుంటారు.
  • దర‌ఖాస్తులు ప్రారంభం తేదీ : జులై 4
  • ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి చివ‌రి తేదీ : జులై 19 (సాయంత్రం 5 గంట‌ల లోపు )
  • గౌర‌వ వేత‌నం : అంగ‌న్ వాడీ వ‌ర్కర్‌కు రూ.11,500, మినీ అంగ‌న్‌వాడీ వ‌ర్కర్‌కు రూ.7,000, అంగ‌న్‌వాడీ హెల్పర్‌కు రూ.7,000
  • ఎంపిక విధానం : ఎటువంటి ప‌రీక్ష ఉండ‌దు. ఇంట‌ర్వ్యూ మాత్రమే నిర్వహిస్తారు. ఇంట‌ర్వ్యూలో ప్రతిభా ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఎటువంటి అప్లికేష‌న్ ఫీజు లేదు.
  • ద‌ర‌ఖాస్తు ఆఫ్‌లైన్‌లోనే చేయాలి. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సీడీపీఓ కార్యాల‌యంలో తమ అప్లికేష‌న్ అంద‌జేయాలి. అర్హత గ‌ల వారు ద‌గ్గరిలోని సీడీపీఓ కార్యాలయంలోనే అప్లికేష‌న్ తీసుకొని, దాన్ని పూర్తి చేసి అన్ని ర‌కాల ధ్రువ‌ప‌త్రాల‌ను జ‌త చేసి వారికి అంద‌జేయాలి.

జ‌త చేయాల్సిన ధ్రువ‌ప‌త్రాలు

ఆధార్ కార్డు, రేష‌న్ కార్డు, పుట్టిన తేదీ, వ‌య‌స్సు ధృవీక‌ర‌ణ ప‌త్రం, కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం, ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా, నివాస స్థల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, వితంతువు అయితే భ‌ర్త మ‌ర‌ణ ధ్రువీకరణ ప‌త్రం, విక‌లాంగురాలైతే పీహెచ్ స‌ర్టిఫికేట్‌, వితంతువు అయి పిల్లలు ఉన్నట్లు అయితే పిల్లల వ‌య‌స్సు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం జిరాక్స్ కాపీల‌ను ద‌ర‌ఖాస్తుకు జ‌త చేయాల్సి ఉంటుంది.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్