Saireddy On BJP: మతతత్వ పార్టీతో CBN పొత్తులు..YCPకి ఏ పొత్తు లేదన్న సాయిరెడ్డి..
21 February 2024, 11:05 IST
- Saireddy On BJP: రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకున్నామని, మత తత్వ పార్టీలతో వైఎస్ఆర్ సీపీ YSRCP పొత్తు పెట్టుకోదంటూ వైసీపీ ముఖ్య నాయకుడు సాయిరెడ్డి ప్రకటించారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
Saireddy On BJP: సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ ముఖ్యనాయకుడు సాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మత తత్వ పార్టీలతో పొత్తులు పెట్టుకునే చంద్రబాబునుChandrababu ప్రజలు నమ్మొద్దని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఏపీలో సిఎం జగన్మోహన్ రెడ్డి JaganmohanReddy సామాజిక న్యాయం పాటిస్తున్నారని, అందులో భాగంగానే అభ్యర్థుల ఎంపిక చేస్తున్నామని చెప్పిన సాయిరెడ్డి బీజేపీని మతతత్వ పార్టీ అంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో సిఎం జగన్ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. గడచిన నాలుగు సంవత్సరాల ఏడు నెలల పాలనలో అన్ని పథకాలు, అన్ని రంగాల్లో సామాజిక న్యాయాన్ని పాటించి, అన్ని వర్గాలకు సిఎం మేలు చేశారని గుర్తు చేశారు.
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న కాలంలో పార్టీ సమతుల్యత పాటిస్తుందని చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు అండదండాలు కావాలని,ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం లేదన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో వైసీపీ బడుగు,బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన పార్టీ అని స్పష్టం చేశారు.. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఒంటరిగానే పార్టీ వెల్తుందని అన్నారు. పేదవారని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చెందుకు జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు.
మతతత్వ పార్టీలతో టీడీపీ పొత్తులు…
మతతత్వ పార్టీలతో పోత్తు పెట్టుకోనే టిడిపిని నమ్మవద్దన్నారు.కేంద్రంతో సత్సంబంధాలు కోసమే పార్లమెంటులో బిల్లులకు మద్దతు ఇస్తున్నామని సాయిరెడ్డి చెప్పారు.
ఏపీలో అన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేంద్ర సహకారం అవసరమని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రిపుల్ తలాక్ లాంటి బిల్లులకు మద్దతు పలక లేదని గుర్తు చేశారు. సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులకు మన పార్టీ ఎప్పుడు మద్దతు ఇవ్వలేదన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్రానికి సహకారం అందిస్తూ వచ్చామని చెప్పారు. మతతత్వపార్టీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోత్తు పెట్టుకొదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీతో పోత్తు కోసం చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి తహతహ లాడుతోందని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు ఏ పార్టీతోను పోత్తు పెట్టుకోలేదని భవిష్యత్తులో కూడా ఉండవని సాయిరెడ్డి స్పష్టం చేశారు.
ఇన్నాళ్లు బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ రైతు చట్టాలు సహా, పలు సందర్భాల్లో బీజేపీకి షరతులు లేని మద్దతు అందిస్తూ వచ్చారు. ఎన్డీఏ కూటమిలో లేకపోయినా బీజేపీకి మద్దతు విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా రాజకీయ మద్దతు అందిస్తూ వచ్చింది.
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పాలన విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐదేళ్లు సజావుగా సాగిపోయాయి. సార్వత్రిక ఎన్నికల వేళ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చేసినవా, టీడీపీ-బీజేపీల మధ్య సయోధ్య కుదురుతున్న నేపథ్యంలో చేసినవా అనే చర్చ జరుగుతోంది.
2018లో వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగంగా ఆ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయడంతో టీడీపీ కూడా పోటీగా ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. 2019లో ఓటమి పాలైంది. అప్పటి నుంచి ఎన్డీఏ కూటమిలో చేరేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతోంది.