Chandrababu On Jagan : అధికారం శాశ్వతం కాదు.. అది గుర్తించాలి
22 December 2022, 20:12 IST
- Chandrababu Comments On YSRCP Govt : ఏపీని జగన్ నాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్రపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు.
ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన
చంద్రబాబు(Chandrababu).. ఉత్తరాంధ్రలో మూడురోజుల పర్యటనలో ఉన్నారు. శ్రీకాకుళం(Srikakulam) జిల్లా పొందూరులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. పొందూరు చేనేత కార్మికులకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్(CM Jagan) రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా.. వైసీపీ(YCP) ఇంటికి వెళ్లడం ఖాయమని చంద్రబాబు అన్నారు. చెత్త మీద పన్ను వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఏపీలో మహిళలపై దాడులు పెరిగాయని కేంద్రం చెబుతోందని.. రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయన్నారు. పొందూరు చేనేత కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు అయిన పూర్తి చేశారా అని చంద్రబాబు(Chandrababu) ప్రశ్నించారు.
'రాష్ట్రాన్ని సీఎం జగన్ నాశనం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర(Uttarandhra)పై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు. ఏపీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ విషయం వైసీపీ నేతలకు అర్థమైతే మంచిది.' అని చంద్రబాబు అన్నారు. తమ్మినేని సీతారాంపై చంద్రబాబు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడని, ఇంతకుముందు మన పార్టీలోనే పెరిగాడని చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తికి స్పీకర్ గా ఉండే అర్హత ఉందా అని అడిగారు. రాజకీయల్లో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు.
మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు(Chandrababu) ఉన్నారు. విజయవాడ(Vijayawada) నుంచి విశాఖకు విమానంలో వెళ్లారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు. ఇదేం కర్మ రాష్ట్రానికి(Idhem Karma Mana Rastraniki) కార్యక్రమంలో మూడు రోజులపాటు రాజాం, బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఈ రాత్రికి రాజాంలోనే బస చేస్తారు. అక్కడ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. 23న బొబ్బిలి, 24న విజయనగరంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటారు.