తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jd Lakshminarayana : నాడు - నేడుతో పాఠశాలల రూపురేఖలు మారాయి - జగన్ పాలనపై జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు

JD Lakshminarayana : నాడు - నేడుతో పాఠశాలల రూపురేఖలు మారాయి - జగన్ పాలనపై జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు

27 October 2023, 15:57 IST

google News
    • CBI EX JD Lakshminarayana News: వైసీపీ సర్కార్ ను ప్రశంసించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.విద్య, వైద్య రంగాల్లో మంచి చేసిన వారికి మంచి ఫలితం ఉంటుందన్నారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

CBI EX JD Lakshminarayana : జగన్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను ప్రశంసించారు. విద్య, వైద్య రంగాల్లో మంచి చేసిన వారికి మంచి ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించారు.

శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాజీ జేడీ లక్ష్మీనారాయణను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ… పిల్లలకు రాగి జావ, నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు బాగున్నాయని ప్రశంసించారు. విద్యా, వైద్య రంగాల్లో మంచి చేసిన వారికి మంచి ఫలితం ఉంటుందన్నారు.

“నాడు - నేడుతో పాఠశాలల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. పిల్లలకు మంచి ఆహారాన్ని కూడా ఇస్తున్నారు. జగనన్న సురక్ష క్యాంపులో మంచి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ కృషిని అభినందించాలి” అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

తదుపరి వ్యాసం