తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Cancelled: విశాఖమార్గంలో భారీగా రైళ్ల రద్దు, దారి మళ్లింపు

Trains Cancelled: విశాఖమార్గంలో భారీగా రైళ్ల రద్దు, దారి మళ్లింపు

Sarath chandra.B HT Telugu

30 October 2023, 7:28 IST

google News
    • Trains Cancelled: విజయనగరం జిల్లా కంకటాపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రైళ్ల రద్దుతో ఆదివారం  రాత్రి  నుంచి రైళ్లు నిలిచిపోవడంతో  ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 
విశాఖ మార్గంలో పలు  రైళ్ల రద్దు
విశాఖ మార్గంలో పలు రైళ్ల రద్దు

విశాఖ మార్గంలో పలు రైళ్ల రద్దు

Trains Cancelled: విజయనగరం జిల్లాలో రాయగడ, పలాస ప్యాసింజర్ల ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దైన రైళ్లలో ట్రైన్ నంబర్ 17243 గుంటూరు - రాయగడ, గుంటూరు - విశాఖపట్నం(17239), కాకినాడ పోర్ట్‌-విశాఖ‌పట్నం ( 17267), విశాఖపట్నం - కాకినాడ పోర్ట్ (17268) రాజమండ్రి - విశాఖపట్నం( 07466), విశాఖపట్నం- రాజమండ్రి (07467), విజయవాడ - విశాఖపట్నం ( 12718), విశాఖపట్నం - విజయవాడ ( 12717) రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

బరౌనీ - కోయంబత్తూరు ( 03357) మధ్య నడిచే రైలును తిత్లిఘర్‌, రాంచీ,నాగపూర్‌, బలార్షా, విజయవాడ మీదుగా మళ్లించారు. టాటానగర్‌ - ఎర్నాకుళం (18189) రైలును గొట్లం, తిత్లినగర్‌, నాగపూర్‌, బలార్షా, విజయవాడ మీదుగా మళ్లిస్తారు. భువనేశ్వర్ - ముంబై (11020) రైలును విజయనగరం, తిత్లిగర్, రాంచీ, నాగపూర్, కాజీపేట మీదుగా మళ్లిస్తారు.

హౌరా -సికింద్రాబాద్( 12703)రైలును విజయనగరం, తిత్లిఘర్‌రాంచీ, నాగరపూర్‌ కాజీపేట మీదుగా మళ్లిస్తారు. హౌరా-బెంగళూరు (12245) రైలును విజయనగరం, తిత్లిఘర్‌, రాంచీ, నాగపూర్‌, బలార్షా, విజయవాడ మీదుగా మళ్లిస్తారు.

సంబల్‌పూర్‌ - నందేడ్‌ (20809) రైలును విజయనగరం వరకు మాత్రమే నడుపుతారు.పూరి-తిరుపతి ( 17479) రైలును పూరి-తిరుపతి రైలును బాలు వరకు నడుపుతారు. ముంబై -భువనేశ్వర్ (11019) రైలును నేడు విశాఖపట్నం వరకు మాత్రమే నడుపుతారు. భువనేశ్వర్-ముంబై(11020) రైలును భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య రద్దు చేశారు.

హౌరా-బెంగళూరు (12863), హౌరా-పుదుచ్చేరి(12867), హౌరా-చెన్నై సెంట్రల్(12839), షాలిమార్‌-త్రివేండ్రం (22642) రైళ్లను రీ షెడ్యూల్ చేశారు.

మంగుళూరు-సంత్రగచ్చి(22852), బెంగుళూరు-హౌరా(12246), తిరుపతి -హౌరా(20890), సికింద్రాబాద్ - హౌరా (12704), బెంగుళూరు - హౌరా (12864), బెంగుళూరు - జసిద్ద్ (223050, కన్యాకుమారి - బెంగుళూరు( 22503) చెన్నై సెంట్రల్- హౌరా ( 12840), వాస్కో డ గామా- షాలిమార్ (18048) , అగర్తలా - బెంగుళూరు (12504), హతియా -బెంగళూరు (12835 రైళ్లను దారి మళ్లించారు

తదుపరి వ్యాసం