తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sankranti Cock Fight: హైటెక్ హంగులతో బరులు రెడీ, పందాలకు కోడి పుంజులు సై!

Sankranti Cock Fight: హైటెక్ హంగులతో బరులు రెడీ, పందాలకు కోడి పుంజులు సై!

13 January 2024, 14:18 IST

google News
    • Sankranti Cock Fight: సంక్రాంతి సరదాలు తెచ్చింది. పండుగకు సొంతూళ్లకు జనం తరలివస్తున్నారు. ఇక పందెంరాయుళ్లు కోడి పందాలకు హైటెక్ హంగులతో భారీ బరులు ఏర్పాట్లు చేశారు.
కోడి పందాలు
కోడి పందాలు

కోడి పందాలు

Sankranti Cock Fight: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే పట్టణం వాసులు పల్లెలకు క్యూకట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు భారీగా తరలివస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది. ఇక పల్లెల్లో రంగు రంగుల హరివిల్లులు, గొబ్బిళ్లు, హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే గుర్తొచ్చిది కోళ్ల పందాలు. కోడి పందాలు ఆడేందుకు, చూసేందుకు పండుగ రోజుల్లో పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. కోడి పందాలకు అధికారికంగా పర్మిషన్ లేకపోయినా, పండుగ మూడు రోజులు అనధికార అనుమతులతో కోడి పందాలు జరుగుతాయి. కోడి పందాల నిర్వహణకు భారీగా బరులు సిద్ధం అయ్యాయి. గోదావరి జిల్లాల్లో కోడి పందాలను ఒక సంప్రదాయంగా నిర్వహించారు. ఈ పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి.

హైటెక్ హంగులతో పందాలు

గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు చాలా క్రేజ్‌ ఉంటుంది. హైటెక్ హంగులతో పందెంరాయుళ్లు బరులు వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కోడి పందాలకు సన్నద్ధం అవుతున్నారు. గుండాట, కోత ముక్క, జూదం ఒక పక్క, మద్యం, కోడి పకోడి, బిర్యానీ, ఫుడ్ స్టాల్స్ ఇలా అన్ని సౌకర్యాలతో పందెం బరుల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ నేతల అండదండలతో సంక్రాంతి మూడు రోజుల పాటు వందల కోట్లు చేతులు మారతాయి. ఇక బరిలో దిగే కోడి పుంజులు పందాలకు సిద్ధంగా ఉన్నాయి. మిలిటరీ స్థాయిలో శిక్షణ ఇస్తూ పుంజులకు పందాలకు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక ఆహారం, ఈత కొట్టి్స్తూ కోళ్లను రంగంలోకి దించేందుకు పందెంరాయుళ్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఏడాది కాబట్టి రాజకీయ నాయకుల మద్దతుతో భారీగా కోడి పందాలు నిర్వహించనున్నారు. రాత్రులు సైతం పందాలు నిర్వహించేందుకు ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడీ స్క్రీన్, డిజిటల్ పేమంట్స్ సిద్ధం చేశారు. ఇక పందాలను మరింత ఆసక్తిగా మార్చేందుకు యాంకర్లను రంగంలోకి దించుతున్నారు.

గోదావరి జిల్లాల్లో భారీ ఏర్పాట్లు

ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తు్న్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 100కు పైగా పెద్ద బరులు, వేల సంఖ్యలో చిన్న బరులను నిర్వాహకులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భోగి రోజు మధ్యాహ్నం నుంచి కోడిపందాలకు అనధికారికంగా అనుమతి లభిస్తుంది. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, వీరవాసరం, యలమంచిలి, ఆచంట, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, దెందులూరి, కైకలూరులో బరులు సిద్ధం చేసిన పందెంరాయుళ్లు అనుమతుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వీటితో సంక్రాంతి ఎడ్ల పందాలు నిర్వహించడం ఆనవాయితీ. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను నుంచి వచ్చిన ఎడ్లు పందాల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. వీటితో పాటు పలు చోట్ల పందులతో పందాలు నిర్వహిస్తుంటారు.

అయితే గ్రామాల‌లో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. పండుగ రోజుల్లో కోడి పందాల నివారించేందుకు 144సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోడిపందాలతో పాటు గుండాట, జూదం, నిషేధిత ఆటలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమంటున్నారు.

తదుపరి వ్యాసం