తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Dasara Specials: దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ 5,500 ప్రత్యేక బస్సులు

APSRTC Dasara Specials: దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ 5,500 ప్రత్యేక బస్సులు

HT Telugu Desk HT Telugu

05 October 2023, 8:48 IST

google News
    • APSRTC Dasara Specials: దసరా పండక్కి సొంతూళ్లకు వచ్చే ప్రయాణికుల కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ పెద్ద ఎత్తున ప్రత్యేక సర్వీసుల్ని నడుపుతోంది.  రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల్ని ప్రకటించింది. సంక్రాంతి సీజన్‌లో 5500 బస్సుల్ని నడుపనున్నట్లు  ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. 
దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

APSRTC Dasara Specials: దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని 5,500 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 13 నుంచి 22 వరకు 2,700 బస్సులు, 23 నుంచి 26 వరకు 2,800 బస్సులు నడపనున్నారు. దసరాకు ముందు హైదరాబాద్‌ నుంచి 2,050, బెంగళూరు నుంచి 440, చెన్నై నుంచి 153 బస్సులు మన రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాలకు సర్వీసులు నడువనున్నాయి.

ఏపీలో విజయవాడ నుంచి 885 బస్సులు, విశాఖ నుంచి 480, రాజమహేంద్రవరం నుంచి 355 కలిపి మొత్తం 1,137 ప్రత్యేక బస్సులను వివిధ జిల్లాలకు నడుపుతారు. వీటిలో సాధారణ ఛార్జీలే ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. రాకపోకలకు కలిపి ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ లభిస్తుంది.. చిల్లర సమస్య లేకుండా యూటీఎస్‌ యంత్రాల ద్వారా ప్రయాణికులు ఫోన్‌పే, గూగుల్‌పే, క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు ఉపయోగించి టికెట్లు కొనుగోలు చేయవచ్చని ప్రకటించారు.

దుర్గాష్టమి 22 నవమి / దశమి 23 కావడంతో ఆంధ్ర ప్రదేశ్ లోని నలుమూలల నుండి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణం కొనసాగిస్తారు. తెలంగాణ, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి అంతరాష్ట్ర నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఏ.పి.ఎస్ ఆర్ టి.సి ప్రత్యేక బస్సులు నడుపనుంది.

సాధారణ రోజులలో ఆర్టీసీ అనేక సర్వీసులతో బస్సులను నడుపుతుంది. కాగా, ఈ పండుగ రోజులలో అదనంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాలకు, రాష్ట్రంలోని మఖ్యపట్టణాలు, నగరాలకు, ప్రాంతాలకు అనగా విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, బెంగుళురు, చెన్నై, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, భద్రాచలం, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం, నెల్లూరులకు ఈ 5,500 ప్రత్యేక బస్సులు నడుపుతారు.

ప్రయాణికులపై భారం మోపకూడదనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ సారి కూడా సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులు నడపబడతాయి. ఈ సారి కూడా ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్ధిక వెసులుబాటు, ఊరట కలిగించింది.

ఏపీఎస్ ఆర్టీసీ లో కొత్తగా ప్రవేశ పెట్టిన యు టి ఎస్ మెషీన్ల వలన ఈసారి చిల్లర సమస్య అనే ప్రస్తావనకు అవకాశం లేదు. ప్రయాణికులు చాలా సులభంగా ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం సాగించే వీలుంది.

ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఇప్పటికే కల్పించారు.రాను పోను అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జి లో 10% రాయితీ సౌకర్యం ఇస్తారు. ఏటీబీ ఏజెంట్లు, ఆర్టీసీ యాప్, ఆన్ లైన్ లలో ద్వారా కూడా టిక్కెట్లు పొందవచ్చు.ప్రత్యేక సర్వీసుల పర్యవేక్షణకై జిల్లా ముఖ్య కేంద్రాలు, హైదరాబాద్ లలో పలు పాయింట్ల వద్ద అధికారులు, సూపర్ వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. అన్ని బస్సులకు. జీపీఎస్ ట్రాకింగ్, 24x7 సమాచారం/ సమస్యలకై కాల్ సెంటర్ నెంబర్ 149 మరియు 0866-2570005 అందుబాటులో ఉంటాయి.

తదుపరి వ్యాసం