APPSC Group - 1 Jobs: ఏపీ గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే
01 October 2022, 19:28 IST
- group -1 notification in ap: ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ –1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఖాళీల వివరాలను పేర్కొంది.
గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
APPSC Group - 1 Notification 2022: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. నవంబర్ 2వ తేదీని దరఖాస్తులు చేసుకునేందుకు తుది గడువుగా నిర్ణయించారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
భర్తీ చేసే పోస్టుల వివరాలు:
డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు - 1
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 1
డిప్యూటీ కలెక్టర్ పోస్టులు - 10
అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు - 12
డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు - 13
డివిజనల్/డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు - 2
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు - 8
రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ పోస్టులు - 2
మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులు - 7
జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు - 3
జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్ పోస్టులు - 1
జిల్లా బీసీ సంక్షేమ ఆఫీసర్ పోస్టులు - 2
మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-II పోస్టులు - 6
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రెటరీ అండ్ ట్రెజర్ గ్రేడ్-II పోస్టులు - 18
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 4
గ్రూప్–1 పోస్టులు 92 ఉండగా ఇందులో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ జాబ్స్ ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జోన్ల వారీగా నియమకాలు
జోన్-1: శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం
జోన్-2: తూర్ప గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ
జోన్-3: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
జోన్-4: చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు
జనరల్ అభ్యర్ధులు రూ.370, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్/ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్ధులు రూ.120 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాతపరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్య వివరాలు
మొత్తం ఉద్యోగాలు - 92
కేడర్ - గ్రూప్ 1
దరాఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 13, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 2, 2022.
ప్రిలిమినరీ ఎగ్జామ్: డిసెంబర్ 18, 2022.
మెయిన్స్ ఎగ్జామ్: మార్చి 2023.
పూర్తి వివరాలను కమిషన్ వెబ్‌సైట్ psc.ap.gov.in/ లో చూడవచ్చు.
మళ్లీ ఇంటర్వూ విధానం…
గతంలో రద్దు చేసిన ఇంటర్వూల విధానాన్ని ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు సెప్టెంబర్ 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఫలికంగా ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్–1 సహా ఇతర అత్యున్నత కేడర్ పోస్టులకు రాత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వూలలో ప్రతిభ చూపించిన వారు ఉద్యోగాలకు ఎంపికవుతారు.