తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Jobs 2022: గుడ్ న్యూస్.. 269 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

APPSC Jobs 2022: గుడ్ న్యూస్.. 269 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu

29 September 2022, 10:15 IST

    • APPSC Jobs 2022: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీపీఎస్సీ ఉద్యోగాలు,
ఏపీపీఎస్సీ ఉద్యోగాలు, (psc.ap.gov.in)

ఏపీపీఎస్సీ ఉద్యోగాలు,

APPSC Job Notification 2022: ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసేంది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మొత్తం 269 ఖాళీలను భర్తీ చేయనన్నట్లు పేర్కొంది.

గ్రూప్-4 కింద 6 పోస్టులు, నాన్ గెజిటెడ్ విభాగంలో 45, ఆయుర్వేద లెక్చర్ల విభాగంలో 3, హోమియో లెక్చరర్ల విభాగంలో 34, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ విభాగంలో మరో 72, హోమియో మెడికల్ ఆఫీసర్ విభాగంలో 53, యునాని మెడికల్ ఆఫీసర్ విభాగంలో 26, ఏఈఈ విభాగంలో 23, సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో మరో 7 ఖాళీలు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లలో చూడొచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి గల అభ్యర్థులు http://psc.ap.gov.in (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు…

గ్రూప్ 4 ఉద్యోగాలు - 6

ఆయుర్వేద విభాగంలో - 3 లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్

ఆయుష్ హోమియో విభాగంలో - 34 లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్లు

ఆయుష్ ఆయుర్వేద విభాగంలో - 72 మెడికల్ ఆఫీసర్లు,

ఆయుష్ హోమియో విభాగంలో - 53 మెడికల్ ఆఫీసర్లు,

ఆయుష్ యునాని విభాగంలో - 26 మెడికల్ ఆఫీసర్లు

పలు విభాగాల్లో 23 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఇన్సురెన్స్ మెడికల్ సైన్సెస్ విభాగంలో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ వివరాలను కింద ఇచ్చిన నోటిఫికేషన్ లో చూడొచ్చు.