HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Japan Scholorships: జపాన్‌లో గ్రాడ్యుయేషన్‌.. నెలకు రూ.63వేల స్కాలర్‌షిప్.. దరఖాస్తు చేసుకోండి ఇలా…

Japan Scholorships: జపాన్‌లో గ్రాడ్యుయేషన్‌.. నెలకు రూ.63వేల స్కాలర్‌షిప్.. దరఖాస్తు చేసుకోండి ఇలా…

Sarath chandra.B HT Telugu

19 April 2024, 12:49 IST

    • Japan Scholorships: మానవ వనరుల్లో నైపుణ్యాన్ని గుర్తించేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరిచేందుకు జపాన్ ప్రభుత్వం భారతీయ విద్యార్ధులకు అందించే MEXT స్కాలర్ షిప్ ప్రోగ్రాంలో నోటిఫికేషన్ విడుదలైంది. 2025 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నెలకు రూ.63వేల స్కాలర్‌షిప్‌తో జపాన్‌లో గ్రాడ్యుయేషన్...
నెలకు రూ.63వేల స్కాలర్‌షిప్‌తో జపాన్‌లో గ్రాడ్యుయేషన్...

నెలకు రూ.63వేల స్కాలర్‌షిప్‌తో జపాన్‌లో గ్రాడ్యుయేషన్...

Japan Scholorships: మానవ వనరుల్లో నైపుణ్యాన్ని గుర్తించేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరిచేందుకు జపాన్ ప్రభుత్వం అందించే MEXT స్కాలర్ షిప్ ప్రోగ్రాంలో దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు. Indo Japan ఇండియా-జపాన్‌ సంబంధాల్లో భాగంగా భారత్ నుంచి అంతర్జాతీయ విద్యార్ధుల్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎంపికైన విద్యార్దులకు నెలకు రూ.63వేల స్కాలర్‌షిప్ Scholorship చెల్లిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

AP Paramedical Courses : ఏపీలో పారా మెడిక‌ల్ డిప్లొమా కోర్సుల‌కు దరఖాస్తులు ఆహ్వానం, చివ‌రి తేదీ ఆగ‌స్టు 6

CM Chandrababu : ఏపీకి మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయ్, రాష్ట్ర అవసరాలను కేంద్రం గుర్తించింది - సీఎం చంద్రబాబు

Prakasam Accident : ప్రకాశం జిల్లాలో విషాదం, స్కూటీపై తెగిపడిన కరెంట్ తీగ -ముగ్గురు యువకులు మృతి

AP Medical Reimbursement : ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం మరో ఏడాది పొడిగింపు

జపాన్ విశ్వవిద్యాలయాల్లో విద్యా రంగంలో పరిశోధనల్ని పెంపొందించేందుకు, అంతర్జాతీయ స్థాయిలో మేధో సంపదను వృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండర్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు అండర్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల వివరాలు, యూనివర్శిటీలు , స్పెషలైజ్డ్‌ ట్రైనింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం a.p.loganathan@ms.mofa.go.jp (Mr. Loganathan) ను సంప్రదించవచ్చని జపాాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది.

2024 మే 27లోగా చెన్నైలోని జపాన్ ఎంబసీ కార్యాలయానికి దరఖాస్తులు చేరాల్సి ఉంటుంది. ఈ మెయిల్ ద్వారా అందే దరఖాస్తులు స్వీకరించరు. 2024 జూన్‌లో దరఖాస్తుల స్క్రీనింగ్ నిర్వహిస్తారు. జూన్‌ రెండో వారంలో షార్ట్‌లిస్ట్‌ చేసిన విద్యార్ధులకు రాత పరీక్ష , ఇంటర్వ్యూ కోసం ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.

పరీక్ష తేదీలు…

2024 జూన్‌ 22న అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్ధులకు పరీక్ష నిర్వహిస్తారు. జూన్‌ 23న కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, స్పెషలైజ్డ్‌ ట్రైనింగ్ కాలేజీ స్టూడెంట్ కోర్సుల కోసం పరీక్ష నిర్వహిస్తారు.

జూన్ 24వ తేదీ తర్వాత ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. జులై రెండో వారంలో ఫలితాలను వెల్లడిస్తారు.

దరఖాస్తులు చేరాల్సిన చిరునామా…

విద్యార్ధులు తమ దరఖాస్తుల్ని నిర్దేశిత ఫార్మాట్‌లో Consulate General of Japan in Chennai, No 12/1 Cenetoph Road, 1st Street, Teynampet, Chennai 600018 చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు కొరియర్‌ లేదా పోస్టు ద్వారా మాత్రమే పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసే విద్యార్ధలు కనీసం 12ఏళ్ల పాఠశాల విద్యను పూర్తి చేసి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు 2025 నాటికి 12 ఏళ్ల విద్యాభ్యాసం పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 ఆగష్టు నాటికి ఫలితాలు వెలువడే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు 12వ తరగతిలో కనీసం 80శాతం మార్కులు సాధించి ఉండాలి. జపాన్ భాషలో ప్రవేశం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.

ఇతర దేశాల విద్యార్ధులకు వర్తించే నియమ నిబంధనలు వర్తిస్తాయి. దరఖాస్తుదారులు జపాన్ భాషనున తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. రాత పరీ‌క్ష, ఇంటర్వ్యూల్లో ఎంపికైన భారతీయ విద్యార్ధులు 2025 ఏప్రిల్ 1-7 నాటికి జపాన్ చేరుకోవాల్సి ఉంటుంది.

కోర్సులు…

సోషల్ స్టడీస్‌ హ్యుమానిటీస్‌ విభాగంలో లా, పాలిటిక్స్‌, సోషియాలజీ, లిటరేచర్, హిస్టరీ, జపనీస్ లాంగ్వేజ్, ఇతర విభాగాల్లో ఎకనామిక్స్‌, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాలు ఉన్నాయి.

సైన్స్ విభాగంలో

Science (1. Mathematics 2. Physics 3. Chemistry)

Electric and Electronic Studies (4. Electronics 5. Electrical Engineering 6. Information Engineering)

Mechanical Studies (7. Mechanical Engineering 8. Naval Architecture)

Civil Engineering and Architecture (9. Civil Engineering 10. Architecture 11. Environmental Engineering)

Chemical Studies (12. Applied Chemistry 13. Chemical Engineering 14. Industrial Chemistry 15. Textile Engineering)

Other Fields (16. Metallurgical Engineering 17. Mining Engineering 18. Maritime Engineering 19. Biotechnology)

Natural Science - B

Agricultural Studies (1. Agriculture 2. Agricultural Chemistry 3. Agricultural Engineering 4. Animal Science 5. Veterinary Medicine 6. Forestry 7. Food Science 8. Fisheries)

Hygienic Studies (9. Pharmacy 10. Hygienics 11. Nursing)

Science (12. Biology) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్ధులకు నెలకు రూ.63,300 స్కాలర్ షిప్ చెల్లిస్తారు. ఎలాంటి ఫీజులు చెల్లించాల్సి అవసరం ఉండదు. ఇతర దేశాల విద్యార్ధులకు ఖర్చుల కోసం అదనంగా మరికొంత మొత్తం చెల్లిస్తారు.

కోర్సులు స్కాలర్ షిప్పుల వివరాల కోసం లింకును ప్రెస్ చేయండి…

https://www.in.emb-japan.go.jp/Education/japanese_government_scholarships.html

జపాన్లోని జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఈ లింకును ప్రెస్ చేయండి…

తదుపరి వ్యాసం