KV Admissions 2024: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు, నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం..
14 October 2024, 11:17 IST
- KV Admissions 2024: దేశంలో నాణ్యమైన విద్యా బోధనలో గుర్తింపు పొందిన కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటి తరగతిలో అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ కొనసాగనుంది.
కేవీల్లో అడ్మిషన్లకు నేటి నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
KV Admissions 2024: కేంద్రీ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నుంచి ఏప్రిల్ 15వరకు కేవీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సోమవారం ఏప్రిల్ 1 ఉదయం 10గంటల నుంచి ఆన్‌లైన్ కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నారు.
కేంద్రీయ విద్యాలయాల్లో 2వ తరగతి నుంచి ఆపై తరగతులు, 11వ తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీలను కూడా సీట్ల లభ్యత బట్టి భర్తీ చేస్తారు. నేటి నుంచి కేవలం ఒకటో తరగతిలో అడ్మిషన్లను మాత్రమే చేపడతారు. ఏప్రిల్ 1న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 15వ తేదీ రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. సంబంధిత KVలలో ఖాళీ ఉంటే మాత్రమే 2వ తరగతి , ఆ పై తరగతుల్లో అడ్మిషన్‌ల కోసం రిజిస్ట్రేషన్లను చేపడతారు.
క్లాస్ 1 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ ఏప్రిల్ 15, 2024 సాయంత్రం 5 గంటల వరకు ప్రకటించారు. ఎంపికైన విద్యార్ధులు, వెయిట్ లిస్ట్‌లో ఉన్న రిజిస్టర్డ్ అభ్యర్థుల మొదటి తాత్కాలిక జాబితా ఏప్రిల్ 19, 2024న అయా క్యాంపస్‌లలో ప్రదర్శిస్తారు. రెండవ తాత్కాలిక జాబితా ఏప్రిల్ 29, 2024న అందుబాటులో ఉంటుంది. మే 8, 2024న మూడవ జాబితాను విడుదల చేస్తారు.
2వ తరగతి నుంచి ఆపై తరగతుల్లో అడ్మిషన్ల జాబితా ఏప్రిల్ 15న విడుదల చేస్తారు. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 29 వరకు అడ్మిషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం, ఆన్‌లైన్ మోడ్‌లో తగినన్ని దరఖాస్తులు రాకపోతే RTE నిబంధనలు, SC, ST మరియు OBC (NCL) కింద అడ్మిషన్ కోసం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌ల కోసం రెండవ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ అడ్మిషన్ ప్రక్రియను మే 8న ప్రారంభించి, మే 15లోగా ముగిస్తారు.
ఒకటో తరగతిలో అడ్మిషన్లకు అర్హతలు…
క్లాస్ 1 కోసం అడ్మిషన్ కోరే విద్యా సంవత్సరంలో మార్చి 31 నాటికి క్లాస్ Iకి 6 సంవత్సరాల వయస్సు ఉండాలి (ఏప్రిల్ 1న పుట్టిన పిల్లలను కూడా అర్హులుగా పరిగణిస్తారు)
అడ్మిషన్ షెడ్యూల్‌లో “ఏదైనా తేదీ ప్రభుత్వ సెలవు రోజు వస్తే తదుపరి పనిదినాన్ని షెడ్యూల్ ప్రారంభ/ముగింపు తేదీలుగా పరిగణించాలని పేర్కొన్నారు. బంధిత వివరాల కోసం అభ్యర్థులు KVS అధికారిక వెబ్‌సైట్ పరిశీలించవచ్చు.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఏప్రిల్ 1, 2024న 1వ తరగతికి సంబంధించిన KVS అడ్మిషన్ 2024ను ప్రారంభించింది. కేంద్రీయ విద్యాలయ క్లాస్ 1 అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.in లో నేరుగా లింక్‌ని తనిఖీ చేయవచ్చు. కేవీ అడ్మిషన్ల కోసం డైరెక్ట్ లింక్‌ను kvsonlineadmission.kvs.gov.in లో కూడా తనిఖీ చేయవచ్చు. ఈ రోజు ఉదయం 10 గంటలకు లింక్ యాక్టివేట్ చేశారు.
2వ తరగతినుంచి 11వ తరగతి వరకు అడ్మిషన్లకు కూడా ఈరోజు ఏప్రిల్ 1న రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. ఈ క్లాసుల్లో అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 10, 2024న ముగుస్తుంది. సంబంధిత KVలో ఖాళీ ఉంటే మాత్రమే క్లాస్-II మరియు అంతకంటే ఎక్కువ తాజా అడ్మిషన్‌ల కోసం రిజిస్ట్రేషన్ అనుమతిస్తారు.
కేవీల్లో డిజిటల్ చెల్లింపులు…
డిజిటల్ విధానంలో ట్యూషన్ ఫీజు చెల్లింపులకు వీలుగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ఎన్పీసీఐకి చెందిన భారత్ బిల్ పేతో ఒప్పందం కుదుర్చుకుంది.దేశ వ్యాప్తంగా 14లక్షల మంది కేవీల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. భారత్ బిల్ పే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా ఉంది.
ఈ ఒప్పందం ప్రకారం ఎన్ పీసీఐ ప్లాట్ ఫామ్ ఎడ్యుకేషన్ ఫీజు కేటగిరీ బిల్లర్ గా వ్యవహరిస్తుందని, ఈ చెల్లింపులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుందని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా కేంద్రీయ పాఠశాలల్లో చేరిన 1.4 మిలియన్లకు పైగా విద్యార్థుల తల్లిదండ్రులు భీమ్-యుపిఐ మరియు ఫోన్‌పే, గూగుల్ పే వంటి ఇతర భారత్ బిల్ పే ఆధారిత మార్గాల ద్వారా తమ పిల్లల పాఠశాల ఫీజులను నిరాటంకంగా చెల్లించవచ్చని భారత్ బిల్ పే చీఫ్ ఎగ్జిక్యూటివ్ నూపుర్ చతుర్వేది తెలిపారు.