AP Govt Jobs : ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు - పోస్టుల వివరాలివే
19 October 2023, 15:13 IST
- AP Health Department Jobs 2023: పలు జిల్లాలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది ఏపీ కుటుంబ, వైద్యారోగ్యశాఖ. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో 56 ఉద్యోగాలు, కృష్ణా జిల్లాలో 52 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలు
AP Health Department Jobs 2023: పలు జిల్లాలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ కుటుంబ, వైద్యారోగ్యశాఖ నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిని కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ముఖ్య వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా:
మొత్తం పోస్టులు - 56
పోస్టుల వివరాలు
1. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2- 2
2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2- 2
3. రేడియోగ్రాఫర్- 1
4. థియేటర్ అసిస్టెంట్- 8
5. ల్యాబ్ అటెండెంట్- 2
6. పోస్ట్‌మార్టం అసిస్టెంట్- 3
7. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్/ రికార్డ్ అసిస్టెంట్- 2
8. జనరల్ డ్యూటీ అటెండెంట్ జీడీఏ/ ఎంఎన్‌వో/ ఎఫ్‌ఎన్‌వో- 28
9. ఆఫీస్ సబార్డినేట్- 1
10. ప్లంబర్- 5
11. ఎలక్ట్రీషియన్- 1
12. ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్- 1
అర్హతలు - పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ, నర్సింగ్ ఆర్డర్లీ కోర్సు, డిప్లొమా.
ఉద్యోగాలకు ఎంపిక - అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా.
జీతం - ఆయా పోస్టులను అనుసరించి 15 వేల నుంచి 32 వేల వరకు ఇస్తారు.
దరఖాస్తు - ఆఫ్‌లైన్ దరఖాస్తులను అనంతపురంలోని హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ - 21 అక్టోబరు 2023.
మెరిట్ లిస్ట్ - 28 డిసెంబర్, 2023
అధికారిక వెబ్‌సైట్ - https://ananthapuramu.ap.gov.in
కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు :
కృష్ణా జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వాసుపత్రుల్లో 52 పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందులో స్టాఫ్ నర్స్ - 24, మెడికల్ ఆఫీసర్- 10, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ - 8, ఎల్‌జీఎస్ - 4, సపోర్టింగ్ స్టాఫ్ - 3, ఫిజియోథెరపిస్ట్ - 2, సెక్యూరిటీ గార్డ్- 1 ఉద్యోగాలు ఉన్నాయి.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, పరాసుపేట, నాయర్‌బడ్డి సెంటర్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 20.అక్టోబరు 2023.
అధికారిక వెబ్‌సైట్: https://krishna.ap.gov.in