HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Universities Vcs : ఏపీలో 17 యూనివ‌ర్సిటీల‌ వీసీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు సెప్టెంబ‌ర్ 28 చివరి తేదీ

AP Universities VCs : ఏపీలో 17 యూనివ‌ర్సిటీల‌ వీసీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు సెప్టెంబ‌ర్ 28 చివరి తేదీ

HT Telugu Desk HT Telugu

11 September 2024, 21:37 IST

    • AP Universities VCs Notification : ఏపీలోని 17 యూనివర్సిటీల వీసీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారు ఈ నెల 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నిబంధనల మేరకు అనుభవం, ఇతర అర్హతలు ఉండాలి.
ఏపీలో 17 యూనివ‌ర్సిటీల‌ వీసీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు   సెప్టెంబ‌ర్ 28 చివరి తేదీ
ఏపీలో 17 యూనివ‌ర్సిటీల‌ వీసీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు సెప్టెంబ‌ర్ 28 చివరి తేదీ

ఏపీలో 17 యూనివ‌ర్సిటీల‌ వీసీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు సెప్టెంబ‌ర్ 28 చివరి తేదీ

AP Universities VCs Notification : రాష్ట్రంలో 17 యూనివ‌ర్సిటీల‌ వైస్ ఛాన్సల‌ర్ల (వీసీ) పోస్టులు భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు సెప్టెంబ‌ర్‌ 28 ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండ‌లి (ఏపీఎస్‌సీహెచ్ఈ) ఈ మేరకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఆంధ్ర యూనివ‌ర్సిటీ (విశాఖ‌ప‌ట్నం), వెంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ (తిరుప‌తి), ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ (గుంటూరు), శ్రీ‌కృష్ణదేవ‌రాయ యూనివ‌ర్సిటీ (అనంత‌పురం), ఆదిక‌వి న‌న్నయ్య యూనివ‌ర్సిటీ (రాజ‌మండ్రి), యోగివేమ‌న యూనివ‌ర్సిటీ (క‌డ‌ప‌), కృష్ణా యూనివ‌ర్సిటీ (మ‌చిలీప‌ట్నం), రాయ‌ల‌సీమ యూనివ‌ర్సిటీ (క‌ర్నూలు), విక్రమ సింహాపురి యూనివ‌ర్సిటీ (నెల్లూరు), జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నాల‌జీ యూనివ‌ర్సిటీ (జేఎన్‌టీయూకే-కాకినాడ‌), జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నాల‌జీ యూనివ‌ర్సిటీ (జేఎన్‌టీయూఏ-అనంత‌పుర‌ం), జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నాల‌జీ యూనివ‌ర్సిటీ (జేఎన్‌టీయూ గుర‌జాడ‌-విజ‌య‌న‌గ‌రం), ప‌ద్మావ‌తి మ‌హిళా విశ్వవిద్యాల‌యం (తిరుప‌తి), ద్రవిడ యూనివ‌ర్సిటీ (కుప్పం), అబ్దుల్ హుక్ ఉర్దూ యూనివ‌ర్సిటీ (క‌ర్నూలు), వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైఆర్ట్స్ యూనివ‌ర్సిటీ (క‌డ‌ప‌), ఆంధ్ర కేస‌రి యూనివ‌ర్సిటీ (ఒంగోలు)ల‌కు వైస్ ఛాన్సల‌ర్ (వీసీ) పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ధ‌ర‌ఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే వారు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://apsche.ap.gov.in/vc_appl.php క్లిక్ చేసిన త‌రువాత రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడీ, మొబైల్ ఫోన్ నెంబ‌ర్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. ఈ మెయిల్ ఐడీకి యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ వ‌స్తుంది. సెప్టెంబ‌ర్ 28 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తు చేసేట‌ప్పుడు సంబంధిత ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000 ఉంటుంది. 17 యూనివ‌ర్సిటీల‌ జాబితా నుంచి విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడం ద్వారా దరఖాస్తుదారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత‌లు

అత్యున్నత స్థాయి యోగ్యత, సమగ్రత, నైతికత, సంస్థాగత నిబద్ధత ఉండి, విశ్వవిద్యాలయ వ్యవస్థలో ప్రొఫెసర్‌గా (యూజీసీ నిబంధనలలో సూచించిన విధంగా కనీసం 10 సంవత్సరాల ప్రొఫెసర్‌గా అనుభవం) లేదా సమానమైన హోదాలో అపారమైన అనుభవం కలిగి ఉండాలి. పరిశోధన లేదా విద్యా సంబంధ నాయకత్వాన్ని ప్రదర్శించినట్లు అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ సంస్థలో విశిష్ట విద్యా రికార్డు కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ...కాల ప‌రిమితి

ఎంపిక ప్రక్రియ పబ్లిక్ నోటిఫికేషన్, సెర్చ్ క‌మిటీ ద్వారా జరుగుతుంది. వైస్-ఛాన్సలర్ ప‌ద‌వీ కాలం మూడేళ్లు ఉంటుంది. పదవీకాలంలో వైస్ ఛాన్సల‌ర్ వేత‌నం యూజీసీ నిబంధనలు 2018లో సూచించిన విధంగా రూ. 2,10,000 వేత‌నం ఉంటుంది.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్