AP TG GDS Short List : ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- షార్ట్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
19 August 2024, 22:56 IST
- AP TG GDS Short List : ఏపీ, తెలంగాణ పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల షార్ట్ లిస్ట్ విడుదలైంది. అభ్యర్థులు జీడీఎస్ అధికారిక వెబ్ సైట్ లో ఉన్న జాబితాలో పేరు చెక్ చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు సెప్టెంబర్ 3వ తేదీ లోపు నిర్దేశించిన ప్రాంతాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది.
ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- షార్ట్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
AP TG GDS Short List : దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఏపీలో 1355 పోస్టులు, తెలంగాణలో 981 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అభ్యర్థులు షార్ట్ లిస్ట్ ను https://indiapostgdsonline.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. పదో తరగతి అర్హతపై మెరిట్ ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించారు. జులై 15 నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. తొలి జాబితాలో ఏపీ నుంచి 1355 మంది, తెలంగాణ నుంచి 981 మందిని ఎంపిక చేశారు.
సెప్టెంబర్ 3 లోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్లు అనుసరించి షార్ట్ లిస్ట్ రూపొందించిట్లు పోస్టల్ అధికారులు తెలిపారు. షార్ట్ లిస్ట్ పేర్లు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 3వ తేదీ లోగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనా అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ గా సేవలు అందించాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్ట్ లో అభ్యర్థుల పేర్ల పక్కన ఇచ్చిన డివిజనల్ హెడ్ ఆఫీస్ లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటో కాపీలతో వెరిఫికేషన్ కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాలి.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు అవసరమయ్యే పత్రాలు
- ఆన్‌లైన్ అప్లికేషన్
- పదో తరగతి మార్కుల మెమో(పుట్టిన తేదీ ధ్రువీకరణకు)
- 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, బదిలీ సర్టిఫికెట్
- కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
- ఆధార్ కార్డు
- దివ్యాంగులకు సంబంధిత ధ్రువీకరణ పత్రం
- అభ్యర్థి మెడికల్ సర్టిఫికెట్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు