AP TET Hall Ticket 2024 : ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
23 February 2024, 14:40 IST
AP TET 2024 Hall Ticket 2024 Updates: ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
ఏపీ టెట్ హాల్ టికెట్లు
AP TET 2024 Hall Ticket 2024 Updates: ఏపీ టెట్ హాల్ టికెట్లు వచ్చేశాయి. అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు. https://aptet.apcfss.in/ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి టెట్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 9వ తేదీతో ముగియనున్నాయి.
AP TET 2024 admit card: ఇలా డౌన్లోడ్ చేసుకోండి
టెట్ అభ్యర్థులు మొదటగా https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హాల్ టికెట్లు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Candidate ID, పుట్టినతేదీతో Verfication Code ను ఎంట్రీ చేయాలి.
మీ టెట్ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
ఏపీ టెట్ 2024 ముఖ్య తేదీలు:
ఏపీ టెట్ నోటిఫికేషన్ - ఫిబ్రవరి 7, 2024.
దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి 18 వరకు అప్లికేషన్లు స్వీకరించారు.
ఈ నెల 19వ తేదీన అభ్యర్థులు మాక్ టెస్ట్ రాసేందుకు అవకాశం కల్పించారు.
ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
టెట్ ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేస్తారు.
ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు.
టెట్ తుది కీని మార్చి 13న రిలీజ్ చేస్తారు.
మార్చి 14న టెట్ తుది ఫలితాలు విడుదల చేస్తారు.
డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
టెట్, డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహించనున్నారు.
టెట్ అర్హతలు..
టెట్ రాసే అభ్యర్థుల్లో…. ఒకటవ తరగతి నుంచి 5 వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిర్వహించే టెట్-1 పేపర్‌కు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ) చేసిన వారే అర్హులు. కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. పేపర్-1 పరీక్ష రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. ఈసారి నుంచే ఈ నిర్ణయాలను అమలుచేయనున్నారు. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించి, డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు.
ఏపీ టెట్ పేపర్–1A, 1B, పేపర్–2A, 2Bలను 150 మార్కులకు నిర్వహిస్తారు. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం ఇస్తారు. ఏపీ టెట్‌లోని అన్ని పేపర్లలోనూ అభ్యర్థులు తప్పనిసరిగా కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్(AP TET) లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.