తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Polycet Admissions: రేపటి నుంచి ఏపీ పాలిసెట్ 2024 అడ్మిషన్లు.. జూన్ 10నుంచి తరగతులు ప్రారంభం

AP Polycet Admissions: రేపటి నుంచి ఏపీ పాలిసెట్ 2024 అడ్మిషన్లు.. జూన్ 10నుంచి తరగతులు ప్రారంభం

Sarath chandra.B HT Telugu

22 May 2024, 5:41 IST

google News
    • AP Polycet Admissions: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ అడ్మిషన్లు మే 23నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 2024 పాలిసెట్ ఫలితాలను ఏపీ సాంకేతిక విద్యా మండలి విడుదల చేసింది. 
ఏపీ పాలిసెట్ - 2024 అడ్మిషన్లు
ఏపీ పాలిసెట్ - 2024 అడ్మిషన్లు

ఏపీ పాలిసెట్ - 2024 అడ్మిషన్లు

AP Polycet Admissions: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ మే 23వ తేదీ గురువారం నుండి ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి ప్రకటించారు. అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ బుధవారం విడుదలైంది.

రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కార్యాలయంలో మంగళవారం పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి విద్యా విషయక సమావేశం నిర్వహించారు. ప్రవేశాలకు సంబంధించిన విభిన్న అంశాలను చర్చించిన సమావేశం సంబంధిత ప్రక్రియకు అవసరమైన ప్రణాళికను ఖరారు చేసింది.

2024-25 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్‌ నిర్వహించారు. ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్ధులకు ఉన్నత విద్యా మండలి ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు ఉచిత శిక్షణ కూడా అందించింది. సంబంధించిన ఫీజు చెల్లింపు తదితర ఆన్ లైన్ ప్రక్రియకు మే 24వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు పది రోజుల పాటు అవకాశం ఉంటుందన్నారు. ధృవపత్రాల వెరిఫికేషన్ కు మే 27 నుండి జూన్ 3వ తేదీ వరకు ఎనిమిది రోజుల లోపు పూర్తి చేయవలసి ఉందన్నారు.

విద్యార్ధులు కోరుకున్న కోర్సులతో పాటు కాలేజీలకు సంబంధించిన ఆప్షన్లను నమోదు చేయడానికి మే 31వ తదీ నుండి జూన్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జూన్ 5వ తేదీన విద్యార్ధులు తాము ఎంచుకున్న ఆప్షన్లను మార్చుకోడానికి అవకాశం ఉంటుందని , జూన్ 7వ తేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని కమీషనర్ వివరించారు.

జూన్ పది నుంచి తరగతులు..

జూన్ పదవ తేదీ నుండి 14వ తేదీ వరకు 5 రోజుల లోపు ప్రవేశాలు ఖరారు అయిన విద్యార్ధులు అయా పాలిటెక్నిక్ కాలేజీలలో వ్యక్తిగతంగా, ఆన్ లైన్ విధానంలో రిపోర్టు చేయవలసి ఉంటుంది. జూన్ 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు ప్రారంభం కానున్నాయి.

ర్యాంకు కార్డులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినందున, పాలిసెట్‌ 2024 వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ప్రవేశాల కౌన్సిలింగ్ కు సిద్దంగా ఉండాలన్నారు.

ఏపీలో పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,42,035 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హాజరుకాగా, 87.61 శాతం మేర 1,24,430 మంది అర్హత పొందారు. వీరిలో బాలికలు 56,464 మంది పరీక్షకు హాజరుకాగా, 89.81 శాతం మంది, బాలురలో 85,561 మంది హాజరుకాగా 86.16 శాతం అర్హత పొందారు. పాలిటెక్ అడ్మిషన్ల సమావేశంలో సాంకేతిక విద్య శాఖ సంయిక్త సంచాలకులు వెలగా పద్మారావు, అదనపు కార్యదర్శి ఎస్ వి ఆర్ కె ప్రసాద్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి రమణబాబు, చీప్ క్యాంప్ ఆఫీసర్ విజయకుమార్ , ఉపసంచాలకులు విజయ బాస్కర్, నేషనల్ ఇన్ ఫర్ మేటిక్ సెంటర్ అధికారులు పాల్గొన్నారు.

తదుపరి వ్యాసం