తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pecet 2023 : ఏపీ పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ నేటి నుంచే!

AP PECET 2023 : ఏపీ పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ నేటి నుంచే!

21 September 2023, 17:27 IST

google News
    • AP PECET 2023 : ఏపీ పీఈసెట్ 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ బుధవారం విడుదలైంది. ఇవాళ్టి నుంచి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
ఏపీ పీఈసెట్
ఏపీ పీఈసెట్

ఏపీ పీఈసెట్

AP PECET 2023 : ఏపీలోని వ్యాయామ కాలేజీల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లకు పీఈసెట్ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఏపీ పీఈసెట్‌ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇవాళ్టి(సెప్టెంబర్ 21) నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పీఈసెట్ కన్వీనర్‌ ఆచార్య పాల్‌కుమార్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సెప్టెంబర్ 23 వరకు కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్‌ కు జనరల్‌, బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబ‌రు 26 నుంచి 28 వరకు కాలేజీల ఎంపికపై వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. సెప్టెంబ‌రు 29న అప్లికేషన్లలో మార్పులు చేసుకునే అవకాశం కల్పించినట్లు కన్వీనర్ ఆచార్య పాల్ కుమార్ పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబరు 3 నుంచి 7వ తేదీ మధ్య కాలేజీల్లో అడ్మిషన్లు పొందాల్సి ఉంటుందని తెలిపారు.

ఏపీలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 31న ఏపీ పీఈసెట్‌ పరీక్ష నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు జూన్ 16న విడుదల చేశారు. ఏపీ పీఈసెట్ పరీక్షలో మొత్తం 977 మంది అర్హత సాధించారు.

టీఎస్ పీఈసెట్ 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్

తెలంగాణలోని కాలేజీల్లో బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను ఇటీవల ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి, పీఈసెట్‌ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ పి. రమేశ్ బాబు విడుద‌ల చేశారు.

కౌన్సెలింగ్ ముఖ్య తేదీలు :

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమెంట్ సెప్టెంబర్ 20 నుంచి 25వ తేదీల్లో ఉంటాయి.
  • సెప్టెంబ‌ర్ 24 నుంచి 25వ తేదీ మ‌ధ్యలో ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థుల‌కు సంబంధించి ఫిజిక‌ల్ వెరిఫికేష‌న్ ఉంటుంది.
  • సెప్టెంబ‌ర్ 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు న‌మోదు
  • సెప్టెంబర్‌ 30వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునే అవ‌కాశం
  • అక్టోబ‌ర్ 3వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు
  • అక్టోబ‌ర్ 4 నుంచి 7వ తేదీల మ‌ధ్యలో కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.
  • అధికారిక వెబ్ సైట్ https://pecet.tsche.ac.in/

ఈ ఏడాది నిర్వహించిన ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులైన బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్‌కు 2,865 దరఖాస్తులు చేసుకోగా, 1,769 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,707 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 21 కాలేజీల్లో, 2,110 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

తదుపరి వ్యాసం