తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Liquor Rates : మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, త్వరలో మరిన్ని కొత్త మద్యం బ్రాండ్లు- ధరల తగ్గింపుపై కమిటీ

AP Liquor Rates : మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, త్వరలో మరిన్ని కొత్త మద్యం బ్రాండ్లు- ధరల తగ్గింపుపై కమిటీ

29 October 2024, 22:21 IST

google News
  • AP Liquor Rates : ఏపీ మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మరిన్ని మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అలాగే ధరల తగ్గింపుపై అధ్యయనానికి ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, త్వరలో మరిన్ని కొత్త మద్యం బ్రాండ్లు- ధరల తగ్గింపుపై కమిటీ
మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, త్వరలో మరిన్ని కొత్త మద్యం బ్రాండ్లు- ధరల తగ్గింపుపై కమిటీ

మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, త్వరలో మరిన్ని కొత్త మద్యం బ్రాండ్లు- ధరల తగ్గింపుపై కమిటీ

AP Liquor Rates : ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్స్ అందుబాటులోకి రానున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో క్వాలిటీ మద్యం తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. మద్యం రేట్లు తగ్గింపుపై ఆలోచన చేస్తు్న్నామన్నారు. ధరల తగ్గింపుపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ వేశామని తెలిపారు. ఆ కమిటీ నివేదిక రాగానే, ఆ మేరకు మద్యం రేట్లు తగ్గిస్తామని వెల్లడించారు. మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ కు అనుమతి ఇచ్చామన్నారు. మద్యం సరఫరాను జీపీఎస్ తో ట్రాకింగ్ చేస్తున్నామన్నారు. పబ్బుల్లో అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడంలేదన్నారు. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతోందన్నారు.

త్వరలోనే మైనింగ్ పాలసీ

రాష్ట్రంలో త్వరలోనే బెస్ట్ మైనింగ్ పాలసీ తీసుకువస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్టోన్ క్రషర్స్, మిల్లర్స్ నిర్వహకులతో సమావేశం నిర్వహించామన్నారు. వైసీపీ హయాంలో మైనింగ్ మంత్రి బెదిరింపులకు పాల్పడి మైనింగ్ ను పూర్తిగా తన సొంతం చేసుకున్నారని ఆరోపించారు. తన వినకపోతే అధికారులను పంపించి అక్రమంగా కేసులు బనాయించారని తెలిపారు. గత ప్రభుత్వం వేధింపులతో అనేక క్వారీలు మూతపడ్డాయన్నారు. వైఎస్ జగన్, పెద్దిరెడ్డి కలిసి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు. గత ఐదేళ్లలో ఇసుకను అక్రమంగా దోచుకున్నారన్నారు. భవన నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు.

బెల్ట్ షాపులకు సీఎం వార్నింగ్

ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయిస్తే రూ.5 లక్షలు జరిమానా విధించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెండోసారి అదే ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్‌ రద్దు చేయాలని ఎక్సైజ్‌ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎక్కడా ఉండకూడదని, బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాలకు మొదటిసారి రూ.5 లక్షలు జరిమానా విధించాలని రెండోసారి పట్టుబడితే లైసెన్స్‌ రద్దు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి తరలించే నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ పై కఠినంగా వ్యవహరించాలని ప్రతి మద్యం షాపులో సీసీ కెమెరాలు ఉండాలన్నారు. ఫిర్యాదుల కోసం ఒక టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి షాపులో మద్యం ధరలను ప్రదర్శించాలని సూచించారు.

పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా తరలిపోవడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే మొదటగా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇసుక విషయంలో తప్పులు జరిగితే ముందుగా అధికారులపైనే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మద్యం పాలసీ, ఇసుక విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందని...దాన్ని క్షేత్ర స్థాయి వరకు సక్రమంగా అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజల జేబులు గుల్ల చేసేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించాల్సిన పనిలేదని అధికారులకు స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం