తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Icet 2024 Updates : ఏపీ ఐసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ - రిజిస్ట్రేషన్ కు ఇవాళే చివరి తేదీ.! ఈ డేట్స్ ను మర్చిపోకండి

AP ICET 2024 Updates : ఏపీ ఐసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ - రిజిస్ట్రేషన్ కు ఇవాళే చివరి తేదీ.! ఈ డేట్స్ ను మర్చిపోకండి

07 September 2024, 13:35 IST

google News
    • AP ICET 2024 Counselling  2024: ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సెకండ్ ఫేజ్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు ఇవాళ్టితో గడువు పూర్తి అవుతుంది. అర్హత సాధించిన అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ - 2024
ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ - 2024 (HT)

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ - 2024

ఏపీలోని ఏంబీఏ కాలేజల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ - 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పాల్గొనే అభ్యర్థులు సెప్టెంబర్ 7వ తేదీ నాటికి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అర్హత సాధించిన అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

రెండో విడతలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన సెప్టెంబర్ 8వ తేదీతో పూర్తి అుతుంది. సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. సెప్టెంబర్ 15వ తేదీన ఎడిట్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 17వ తేదీన సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబర్ 17 నుంచి 21 తేదీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.

ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఐసెట్ పరీక్షకు మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 18,890 మంది బాలురు, 29,938 మంది బాలికలు ఉన్నారు. పరీక్షకు మొత్తం 44,446 మంది (91 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. మే 8న ఐసెట్ ప్రిలిమినరీ కీ అందుబాటులోకి వచ్చింది.

ఐసెట్ ర్యాంక్ కార్డ్‌ ఇలా చెక్‌ చేసుకోండి…

  • ఏపీ ఐసెట్ రాసిన అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే AP ICET Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ వివరాలు నమోదు చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షను ఈ ఏడాది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహించింది.ఈ ఏడాది ఫలితాల్లో 96.71 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఏపీ ఐసెట్‌ 2024 ఫలితాల ఆధారంగా… రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్శిటీల పరిధిలోని కన్వీనర్ కోటా, ప్రైవేట్, మైనార్టీ,అన్‌ఎయిడెడ్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసిఏలలో ప్రవేశాలు కల్పిస్తారు.ఓసీ, బీసీ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లించాలి. కౌన్సిలింగ్ ఫీజును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం