CBN Quash Petetion: చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
22 September 2023, 13:38 IST
- CBN Quash Petetion: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది.ఈ మేరకు జస్టిస్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
మరికాసేపట్లో బాబు పిటిషన్లపై తీర్పు
CBN Quash Petetion: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు తరపున దాఖలైన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాతే సిఐడి కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
17ఏ, 409 సెక్షన్ల పై గత వారం చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సిఐడి వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు పిటిషన్లను తోసిపుచ్చింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిఐడి తరపున ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
చంద్రబాబు నాయుడు రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ న్యాయమూర్తి విచారించారు. ఈ నేపథ్యంలో 24వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 5రోజుల కస్టడీకి ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా వేశారు.
అటు ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫున దాఖలైన క్వాష్ పిటిషన్లపై తీర్పు వెలువడటంతో ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్లపై నిర్ణయం తీసుకోనుంది. హైకోర్టు తీర్పు ఆలస్యం కావడంతో ఏసీబీ కోర్టు విచారణ వాయిదా పడింది. హైకోర్టు నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాలనే ఉద్దేశంతో వేచి చూడాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భావించారు.
శుక్రవారం ఉదయం జరిగిన విచారణలో మధ్యాహ్నం క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడనుందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏసీబీ కోర్టు జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. శుక్రవారం క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ శ్రీనివాస రెడ్డి బెంచ్ తీర్పు వెలువరించింది.
సెప్టెంబర్ 10న ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఎఫ్‌ఐఆర్ ను కొట్టేసి చేసి రిమాండ్ రద్దు చేయాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిఐడి తరపున ముఖుల్ రోహత్గీ గత వారం వాదనలు వినిపించారు. ఈ కేసుల్లో వాదనలు నాలుగు రోజుల క్రితమే పూర్తయ్యాయి. చివరకు హైకోర్టులో చంద్రబాబుకు నిరాశ తప్పలేదు. క్వాష్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించడంతో బాబు తరపున న్యాయప్రయత్నాలు కొనసాగించనున్నారు.
న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి పిటిషన్ డిస్మిస్ అంటూ ఏక వాక్యంలో క్వాష్ పిటిషన్‌పై ఉత్తర్వులు వెలువరించారు.