తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Skill Scam Case: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ.. రేపటికి తీర్పు రిజర్వ్‌

Skill Scam Case: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ.. రేపటికి తీర్పు రిజర్వ్‌

30 October 2023, 16:41 IST

google News
    • Skill Development Scam Updates:చంద్రబాబు ఆరోగ్య కారణాలతో వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు… తీర్పును రిజర్వ్ చేసింది. 
స్కిల్ స్కామ్ కేసు
స్కిల్ స్కామ్ కేసు

స్కిల్ స్కామ్ కేసు

Skill Development Scam: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై అత్యవసర కారణాలతో వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు బాబు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌, లూథ్రాలు వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్య రిత్యా బెయిల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించగా.. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం… తీర్పును రిజర్వు చేసింది. రేపు నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇక మెయిన్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఎపుడు చేపట్టాలో రేపే నిర్ణయం తీసుకుంటామని తీర్పులో పేర్కొన్నారు.

చంద్రబాబు తరపున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌ వాదనలు వినిపించారు. చంద్రబాబు వయసు, ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలన్న విజ్ఞప్తిని పరిశీలించాలని కోరారు. కంటికి ఆపరేషన్‌ చేయాలని వైద్యులు సూచించారని.. కాబట్టి బెయిల్‌ ఇవ్వాలని వాదించారు.ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది.

తదుపరి వ్యాసం