AP Cabinet: కేబినెట్ రేస్ నుంచి ఆయన ఔట్.. అందుకే పదవి రెన్యూవల్ చేశారా..!
10 April 2022, 10:35 IST
- మరికొద్ది గంటల్లో ఏపీ కేబినెట్ కొత్త జాబితా బయటికి రానుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లా నుంచి కేబినెట్ రేస్ లో ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో అనూహ్యా నిర్ణయం తీసుకున్నారు.
తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి... ఫ్రమ్ చంద్రగిరి. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు. వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉన్నారు. జగన్ అడుగుజాడల్లో అడుగేసిన కీలక నేతల్లో ఆయన ఒకరు. అలాంటి నేత అయిన చెవిరెడ్డికి 2019లోనే మంత్రి పదవి పక్కా అనుకున్నారు. కానీ పలు సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయనకు చోటు దక్కలేదు. తాజాగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు సీఎం జగన్. ఇక చిత్తూరు జిల్లా నుంచి ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. ఈసారైనా మినిస్టర్ పదవి పక్కా దక్కుతందని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ముఖ్యమంత్రి జగన్.. ఆయన విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
తుడా ఛైర్మన్ గా మరోసారి...
అధికారంలోకి వచ్చిన తరువాత చెవిరెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన్ను తుడా ఛైర్మన్(tirupati urban development authority)గా నియమించారు సీఎం జగన్. రెండేళ్ల పాటు ఉన్న గడువు తాజాగా ముగిసింది. అయితే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మరో రెండేళ్లపాటు కొనసాగిస్తూ ఏపీ సర్కార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 11న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ పదవిని మరోసారి రెన్యూవల్ చేయటం జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. కేబినెట్ లో చోటు దక్కకపోవచ్చనే విశ్లేషణలు ఊపందకున్నాయి.
రేపే కొత్త కేబినెట్
మరోవైపు కొత్త కేబినెట్ రేపు కొలువుదీరనుంది. ఇవాళ గవర్నర్ కు కొత్త మంత్రుల జాబితా అందనుంది. అనంతరం వారి పేర్లు బయటిరానున్నాయి. రేపు ఉదయం 11 గంటల తరువాత ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. అయితే జాబితాలో ఎవరి పేరు ఉంటుందనే దానిపై అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
టాపిక్