AP Govt Jobs 2024 : ఏపీ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు - మంచి జీతం, దరఖాస్తులకు మరికొన్ని గంటలే ఛాన్స్ ..!
24 October 2024, 6:19 IST
- AP Fisheries Dep Recruitment : ఏపీ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మూడు ప్రోగ్రామ్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల గడువు ఇవాళ్టితో(అక్టోబర్ 27) ముగియనుంది. https://fisheries.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను చూడొచ్చు.
ఏపీ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు
ఏపీ ఫిషరీస్ డిపార్ట్ మెంట్ నుంచి రిక్రూట్ మెంట్ ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన( Pradhan Mantri Matsya Sampada Yojana ) కింద మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రతిపాదికన ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఇవాళే చివరి తేదీ..!
దరఖాస్తుల గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. https://fisheries.ap.gov.in/ వెబ్ సైట్ లోకి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫీషరిస్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేయటం లేదా... జువాలజీ, మెరైన్ సైన్స్, మెరైన బయలాజీ, ఫిషరీస్ ఎకనామిక్స్ లేదా ఐటీలో పీజీ చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు నోడల్ ఆఫీసర్ 8332959836 ను సంప్రదించవచ్చు.
నెలకు జీతం రూ. 45వేలు...
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.45 వేల జీతం చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి. అప్లికేషన్ ఫారమ్ ను https://fisheries.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ ను comfishap@gmail.com మెయిల్ అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది. ఎంపికైన వారు కృష్ణా, బాపట్ల, కర్నూలు జిల్లా పరిధిలో విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ ప్రకటన - ఫిషరీస్ డిపార్ట్ మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
- ఉద్యోగాలు - ప్రోగ్రామ్ మేనేజర్
- ఖాళీలు - 03
- దరఖాస్తులకు చివరి తేదీ - 24 అక్టోబర్ 2024
- https://fisheries.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- పూర్తి చేసిన దరఖాస్తులను comfishap@gmail.com మెయిల్ అడ్రస్ కు పంపాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://fisheries.ap.gov.in/
- ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ - 8332959836