తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ecet Key 2024 : అలర్ట్... ఏపీ ఈసెట్‌ ప్రాథమిక 'కీ' విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

AP ECET Key 2024 : అలర్ట్... ఏపీ ఈసెట్‌ ప్రాథమిక 'కీ' విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

10 May 2024, 21:20 IST

google News
    • AP ECET Key 2024 Updates : ఏపీఈసెట్ - 2024 ప్రిలిమినరీ కీ విడుదలైంది. రెస్పాన్స్‌ షీట్‌ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మాస్టర్‌ ప్రశ్నపత్రాలను వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీఈసెట్ 2024
ఏపీఈసెట్ 2024

ఏపీఈసెట్ 2024

AP ECET Preliminary Answer Key 2024: ఈసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. వెబ్ సైట్ లో ప్రాథమిక కీని అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. అంతేకాకుండా రెస్పాన్స్ షీట్లతో పాటు మాస్టర్‌ ప్రశ్నపత్రాలను కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి వీటిని పొందవచ్చు.

AP ECET Preliminary Key 2024 - కీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

  • ఏపీ ఈసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్లండి.
  • హోంపేజీలో కనిపించే Preliminary కీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రాసిన సబ్జెక్టుల పేర్లు కనిపిస్తాయి.
  • అక్కడ క్లిక్ చేస్తే ప్రాథమిక కీ ఓపెన్ అవుతుంది.
  • డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

AP ECET Response Sheet 2024 - రెస్పాన్స్‌ షీట్లను కూడా పొందవచ్చు.

  • ఏపీ ఈసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్లండి.
  • హోంపేజీలో కనిపించే Response Sheet ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ మరియు హాల్ టికెట్ నెంబర్లను ఎంట్రీ చేయాలి.
  • గేట్ కీ డిటేయిల్స్ ఆప్షన్ పై నొక్కితే మీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది.

ఇక ప్రాథమిక కీలోని అభ్యంతరాలను మే 12లోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాలని అధికారులు తెలిపారు. ఈసెట్ ద్వారా…. బీఈ/ బీటెక్‌ (BTech)/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో అడ్మిషన్లను కల్పిస్తారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు ఈ పరీక్ష రాస్తారు. ఈసారి అనంతపురం జేఎన్‌టీయూ పరీక్షను(మే 8) నిర్వహించింది.

ఆంధ్రప్రదేశ్‌ లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్‌ నోటిఫికేషన్ 2024 గత మార్చిలో విడుదలైంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది.

మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల తర్వాత ఇంజనీరింగ్ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశాల కోసం ఈసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్ధులు ప్రవేశాలు పొందవచ్చు.

ఈసెట్‌ 2024 ప్రవేశాల కోసం మార్చి 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించారు. రూ.5వేల ఆలస్య రుసుముతో మే 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే8వ తేదీన ఎగ్జామ్ జరిగింది.

ఈసెట్ పరీక్షలో 200మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 50 మార్కులు మ్యాథ్స్‌ నుంచి ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. మరో 100 మార్కులు సంబంధిత విభాగానికి సంబంధించినవి ఉంటాయి. ఫార్మసీ విభాగంలో ఫార్మాస్యూటిక్స్‌లో 50 మార్కులు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో 50, ఫార్మాకాగ్నసీలో 50, ఫార్మాకాలజీలో 50 మార్కలుకు ప్రశ్నలు ఉంటాయి. బిఎస్సీ విద్యార్హతతో దరఖాస్తు చేసేవారికి మ్యాథ్స్‌లో 100 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీలో 50, కమ్యూనికేషన్ ఇంగ్లీష్‌లో 50 ప్రశ్నలు ఉంటాయి. అగ్రికల్చర్ బిఎస్సీ ప్రవేశాలకు డిప్లొమా కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం