తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ecet Bpharacy Admissions: ఏపీ ఈసెట్‌ 2024 బీఫార్మసీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

AP ECET BPharacy Admissions: ఏపీ ఈసెట్‌ 2024 బీఫార్మసీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

19 September 2024, 12:06 IST

google News
    • AP ECET BPharacy Admissions: ఏపీ ఈసెట్‌ అడ్మిషన్లలో భాగంగా బీఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో బీఫార్మసీ ప్రవేశాలను చేపడతారు. 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. 
ఈసెట్ బీఫార్మసీ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం
ఈసెట్ బీఫార్మసీ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం

ఈసెట్ బీఫార్మసీ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం

AP ECET 2024 Admissions: ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ అడ్మిషన్లలో భాగంగా బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ షెడ్యూల్‌ ప్రకటించింది. ఇప్పటికే ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తయ్యాయి. తాజాగా డిఫార్మసీ విద్యార్థుల కోసం లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లను నిర్వహిస్తున్నారు.

ఈసెట్‌లో భాగంగా అర్హులైన డిఫార్మసీ విద్యార్థులు బీఫార్మసీ కోర్సులో ప్రవేశాల కోసం వెబ్‌ ఆప్షన్లను సాంకేతిక విద్యామండలి అందుబాటులో తెచ్చింది. ఏపీ ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లోని ఈసెట్‌లో బీఫార్మసీ విండోను శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచుతారు.

బీఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్ధులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌, వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోడానికి సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు గడువు ప్రకటించారు. పూర్తి వివరాలను ఏపీ ఉన్నత విద్యామండలి సెట్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈసెట్‌ అడ్మిషన్లలో భాగంగా అర్హులైన డిప్లొమా హోల్డర్లు ఫార్మసీ ఫేజ్‌ వెబ్‌ కౌన్సిలింగ్‌ కోసం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్న సీట్లను కౌన్సిలింగ్‌లో భర్తీ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు...

సెప్టెంబర్ 20 నుంచి 21వరకు ఆన్‌‌లైన్‌ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్‌

సెప్టెంబర్ 21 నుంచి 22వరకు హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ పూర్త చేయాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 21 నుంచి 22 మధ్య అర్హులైన విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 23తో వెబ్ ఆప్షన్ విండో గడువు ముగుస్తుంది.

సెప్టెంబర్ 25న సీట్లు కేటాయిస్తారు.

సెప్టెంబర్ 26 నుంచి 28 మధ్య విద్యార్థులు కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఫీజులు

బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈసెట్‌ 2024 అడ్మిషన్ విండోను ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ లింక్‌ క్లిక్ చేయాలి...

ఈసెట్‌ హాల్ టిక్కెట్ మీద ఉండే హాల్ టిక్కెట్ నంబర్, పుట్టిన తేదీను ఎంటర్ చేయాలి.

అక్కడ కనిపించే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. అక్షరదోషాలు లేవని నిర్ధారించుకోవాలి. తప్పులు ఉంటే సవరించుకోవాలి. దరఖాస్తు సవరించడానికి YES బటన్‌ ప్రెస్ చేయడం ద్వారా తప్పులు సరిచేసుకోవచ్చు. ఆ పై దరఖాస్తును సబ్మిట్ చేయాలి. సవరణకు సంబంధించిన ఆధారాలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పేమెంట్ బటన్‌ క్లిక్ చేయాల్సి ఉంటుంది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో హెల్ప్‌లైన్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. https://ecet-sche.aptonline.in/ECET/Views/index.aspx

అభ్యర్థులకు సందేహాలు ఉంటే కింది చిరునామాలో సంప్రదించవచ్చు.

a) Office address:

O/O THE COMMISSIONER OF TECHNICAL EDUCATION,

The CONVENOR, APECET-2024 ADMISSIONS,

D.NO:11-307, GARUDADRI K.K TOWERS,

FLAT.NO:501, 6TH FLOOR,LAKSHMI NARASIMHA COLONY,

BYPASS ROAD,NEAR Dr.YSR AAROGYASRI HEALTHCARE TRUST,

MANGALAGIRI,GUNTUR DISTRICT-522 503

b) e-Mail ID: convenorapecet2024@gmail.com

c) Help Desk Numbers: 7995681678, 7995865456.

ఇప్పటికే పూర్తైన ఈసెట్‌ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్..

ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్ 2024 తుదిదశ కౌన్సిలింగ్‌లో 20,969 సీట్లను భర్తీ చేశారు. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం ప్రవేశాలకు నిర్ధేశించిన ఏపీ ఈసెట్ 2024 తుదిదశ సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు.తుదిదశ ప్రవేశాల అనంతరం 240 కళాశాలలలో 41922 సీట్లు ఉండగా , 20969 సీట్లను భర్తీ చేసినట్టు కన్వీనర్ వివరించారు.

రాష్ట్రంలోని 19 విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలల్లో 2181 సీట్లు ఉండగా 1823 మంది సీట్లు పొందారు. 221 ప్రవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో 39741 సీట్లకు 19146 సీట్లు భర్తీ చేశారు.

ఏపీ ఈసెట్ 2024 లో 32,881 మంది అర్హత సాధించగా, తుది దశ కోసం 2128 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 2098 మంది అర్హత పొందారు. అయితే తుది దశలో అడ్మిషన్లు పొందిన సంఖ్య 4,890గా ఉంది. కళాశాలల యాజమాన్యాలు ఆగస్టు 14లోపు భర్తీ అయిన సీట్లు, విద్యార్ధుల వివరాలను సాంకతిక విద్యా శాఖకు పొందుపరచవలసి ఉందని కన్వీనర్ వివరించారు.

తదుపరి వ్యాసం