తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Eap Cet 2024: రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ 2024 రిజిస్ట్రేషన్స్.. మే13 -19 మధ్య ప్రవేశపరీక్ష

AP EAP CET 2024: రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ 2024 రిజిస్ట్రేషన్స్.. మే13 -19 మధ్య ప్రవేశపరీక్ష

Sarath chandra.B HT Telugu

11 March 2024, 13:07 IST

google News
    • AP EAPCET 2024 Registration: ఆంధ్రప్రదేశ్‌ EAPCET 2024 నోటిఫికేషన్ విడుదలైంది. మంగళవారం నుంచి ఆన్‌‌లైన్‌ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ కానుంది. జేఎన్‌టియూ కాకినాడ JNTU Kakinada ఆధ్వర్యంలో ఈ ఏడాది ఈఏపీ సెట్ నిర్వహించనున్నారు.
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ

రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ

AP EAPCET 2024 Registration: ఏపీలో ఇంజనీరింగ్ Engineering, అగ్రికల్చర్ Agriculture, ఫార్మసీ Pharmacy కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ జేఎన్‌టియూ కాకినాడ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీ సెట్ నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్‌ పరీక్ష ద్వారా ఈఏపీ సెట్ 2024 నిర్వహిస్తారు.

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కేసుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఏపీ ఈఏపీ సెట్ (AP EAPCET 2024) ను మే 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు.

మార్చి 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు

ఒక పేపర్ కు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500, ఇతరులందరికీ రూ.900 ఫీజు నిర్ణయించారు. రెండు పేపర్లకు అప్లై చేసుకునే అభ్యర్థులకు SC, ST, PWDలకు రూ. 1000 ఫీజు, మిగిలిన అభ్యర్థులు రూ.1800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఏపీలోని ప్రభుత్వ,ప్రైవేట్ ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం ఏపీ ఈఏపీ సెట్ 2024 నిర్వహిస్తున్నారు.

ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ 12వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

https://cets.apsche.ap.gov.in/EAPCET లో అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణలో ఇప్పటికే మొదలైన రిజిస్ట్రేషన్లు…

TS EAP CET 2024: తెలంగాణ ఈఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ Notification విడుదలైంది. జేఎన్‌టియూ హైదరాబాద్‌ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో ఇంజనీరింగ్ Engineering కాలేజీలతో పాటు అగ్రికల్చర్ Agriculture, ఫార్మసీ Pharmacy కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి తరపున జేఎన్‌టియూ హైదరాబాద్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈఏపీ సెట్ 2024ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష Computer Based test ద్వారా నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి అయాకోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణ ఈఏపీ సెట్‌ 2024ను ఆన్‌లైన్‌ పద్ధతిలో మాత్రమే నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ పద్ధతిలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆలస్య రుసుము వివరాలు, తేదీలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పూర్తి సమాచారం కన్వీనర్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. మరింత సమాచారంతో పాటు దరఖాస్తుల కోసం అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tsche.ac.in లో అందుబాటులో ఉంటుంది.

ప్రవేశ పరీక్ష తేదీలు ఇవే...

ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను మే 9, 10 తేదీలలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌లో 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం సెషన్‌ 3 నుంచి ఆరు గంటల వరకు నిర్వహిస్తారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లలో ప్రవేశపరీక్షను మే 11,12 తేదీల్లో నిర్వహిస్తారు. ఉదయం 9-12 మధ్య ఓ సెషన్, మధ్యాహ్నం 3 నుంచి ఆరు వరకు మరో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

ఈఏపీ సెట్‌ 2024 దరఖాస్తు ఫీజును ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైన అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించారు. ఇతర క్యాటగిరీల అభ్యర్థులకు రూ.900గా నిర్ణయించారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000గా, ఇతరులకు రూ.1800గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ ఫీజులను టిఎస్‌ ఆన్‌లైన్‌ సెంటర్లలో చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ ఆన్‌లైన్ సెంటర్లలో చెల్లించే వారు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ సెంటర్ల ద్వారా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 14 లోపు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.2500తో ఏప్రిల్ 19 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మే 1 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ముఖ్యమైన తేదీలు (TS EAPCET 2024 Important Dates)

ఫిబ్రవరి 21 - నోటిఫికేషన్ విడుదల

ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు-ఆన్ లైన్ అప్లికేషన్లు

ఏప్రిల్ 8 నుంచి 12 వరకు- ఎడిట్ ఆప్షన్

మే 1 నుంచి -హాల్ డికెట్లు డౌన్ లోడ్

మే 9, 10వ తేదీల్లో- ఇంజినీరింగ్ కోర్సులకు పరీక్షలు,

మే 11, 12వ తేదీల్లో -అగ్రిక‌ల్చర్, ఫార్మసీ కోర్సుల‌కు ప్రవేశ ప‌రీక్షలు

తదుపరి వ్యాసం