AP Job Mela : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్- రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో జాబ్ మేళా, 1278 ఉద్యోగావకాశాలు
06 October 2024, 17:51 IST
- AP Job Mela : ఏపీలోని పలు జిల్లాల్లో ఈ నెల 7, 8 తేదీల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరై తన ప్రతిభకు తగిన ఉద్యోగం పొందవచ్చు. ఏలూరు, నంద్యాల, విజయనగరం, అల్లూరి జిల్లాలో పలు ప్రైవేట్ సంస్థలలో సుమారు 1278 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్- రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో జాబ్ మేళా, 1278 ఉద్యోగావకాశాలు
ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్- రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో జాబ్ మేళా, 1278 ఉద్యోగావకాశాలు
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెల 7, 8 తేదీల్లో ఏలూరు, అల్లూరి, నంద్యాల, విజయనగరం జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించనున్నారు. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తు్న్నాయి. అర్హులైన అభ్యర్థులు ముందుగా https://employment.ap.gov.in/Default.aspx ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని, నిర్ణీత తేదీల్లో ఆయా ప్రదేశాల్లో నిర్వహించే జాబ్ మేళాకు హాజరవ్వాలి.
జాబ్ మేళా ప్రదేశం - ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం, ఎం.నాగులపల్లి గ్రామం
- జాబ్ మేళా తేదీ : 07-10-2024
- ఖాళీలు - 50
- లిక్సిల్ ఇండియా శానిటరీవేర్ సంస్థలోని ఉత్పత్తి విభాగంలో 50 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 8వ తరగతి పాస్ అయ్యి 18-30 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. నెలకు రూ. 16,300 వేతనం అందిస్తారు.
జాబ్ మేళా ప్రదేశం - ప్రభుత్వ ఐటీఐ విజయనగరం, బీసీ కాలనీ వీటీ అగ్రహారం
- జాబ్ మేళా తేదీ -08/10/2024
- ఖాళీలు - 640
- ఇన్వోవ్, మయూర వెస్ట్రన్, టాటా ఎలక్ట్రానిక్స్, డీమార్ట్, ఎస్బీఐ కార్డ్స్ సంస్థల్లో మెషీన్ ఆపరేటర్ ఇతర సపోర్టింగ్ స్టాఫ్, క్యాషియర్స్, ఎగ్జిక్యూటివ్స్, మొబైల్ తయారీ విభాగాలలో పనిచేసేందుకు 280 మంది కావాలి. ఎస్ఎస్సీ, ఇంటర్ పైనా, ఐటీఈ అభ్యర్థులు అర్హులు. 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు గలవారు దరఖాస్తుచేసుకోవచ్చు. నెలవారీ వేతనం రూ.14000.
- అలాగే జస్ట్ డయల్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, మెడ్ ప్లస్ ఫార్మసిస్ట్ లు, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ లోన్ ఆఫీసర్లు భర్తీ చేయనున్నారు. మొత్తం ఐదు ఎంప్లాయిర్స్ 640 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
జాబ్ మేళా ప్రదేశం- యూత్ ట్రైనింగ్ సెంటర్, చింతపల్లి, అల్లూరి జిల్లా
- ఉద్యోగ మేళా తేదీ : 08/10/2024
- ఖాళీలు : 150
- అపోల్ ఫార్మసీ, కేర్ ఫర్ యూ, నవత రోడ్ ట్రాన్స్ పోర్ట్ లో 150 పోస్టులను ఈ జాబ్ మేళాలో భర్తీ చేయనున్నారు. ఫార్మసీ, నర్సింగ్, ఎస్ఎస్సీ, ఇంటర్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.11 వేలు కనీసం వేతనం చెల్లిస్తారు.
జాబ్ మేళా ప్రదేశం - PSC KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నంద్యాల
- ఉద్యోగమేళా తేదీ : 08/10/2024
- ఖాళీలు:438
- నంద్యాలలో ఐటీఎం స్కిల్ అకాడమీ, నవభారత్ ఫెర్టిలైజర్స్ , టాటా హెల్త్ ఇన్సూరెన్స్ , యంగ్ ఇండియా ప్రై లిమిటెడ్ కంపెనీల్లో 438 పోస్టులను ఈ ఉద్యోగ మేళాలో భర్తీ చేయనున్నారు.