తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Cm Ys Jagan Launches Ramco Cement Factory In Nandyal

AP CM YS Jagan news | నంద్యాల జిల్లా లో రామ్‌కో సిమెంట్‌ ప్లాంట్‌ ప్రారంభం

HT Telugu Desk HT Telugu

28 September 2022, 21:53 IST

    • AP CM YS Jagan news | ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా లో రామ్‌కో సిమెంట్‌ ప్లాంట్‌ ను సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. 
సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్
సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్

సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్

AP CM YS Jagan news | నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం, కల్వటాల వద్ద రామ్‌కో సంస్థ సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఈ ఫ్యాక్టరీని బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి వేసవి ప్రత్యేక రైళ్లు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

AP CM YS Jagan news | స్థానికులకు ఉద్యోగావకాశాలు

సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ఇక్కడ ఈ పరిశ్రమ రావడం వల్ల స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఉపాధి కోసం సొంత ఊర్లు వదిలి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఉన్న ప్రాంతంలోనే ఉద్యోగం చేసుకోవచ్చన్నారు. ఈ ప్రాంతంలో విస్తారంగా సున్నపురాయి నిల్వలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు రాలేదన్నారు. ఇప్పుడు దాదాపు 2 మిలియన్‌ టన్నుల క్లింకర్‌ కెపాసిటీతో పాటు, 1.5 మిలియన్‌ టన్నుల గ్రైండింగ్‌ కెపాసిటీతో ప్లాంట్‌ ఏర్పాటైందని సీఎం జగన్ వివరించారు.

AP CM YS Jagan news | కార్పొరేట్‌ సామాజిక బాధ్యత

ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని, పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఎలాగూ చట్టం చేశాం కాబట్టి, ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కూడా వస్తాయని ఆయన వివరించారు.

AP CM YS Jagan news | కర్నూలుకు మేలు

ఇక్కడ ఇటీవలే గ్రీన్‌కో ప్రాజెక్టు తలపెట్టిన 5400 మెగావాట్ల కెపాసిటీతో సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి.. పంప్‌ స్టోరేజీతో రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు కొద్ది నెలల క్రితమే శంకుస్తాపన చేసిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. అక్కడ దాదాపు 2600 ఉద్యోగావకాశాలు రానున్నాయని, ఆ విధంగా కర్నూలు జిల్లాకు మేలు జరుగుతుందని తెలిపారు.

AP CM YS Jagan news | భారీగా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు

‘‘ఇక్కడ రాయలసీమలో ఉద్యోగ అవకాశాలు రావాలంటే.. అది గ్రీన్‌ ఎనర్జీ ద్వారా సాధ్యం అని నమ్ముతున్నాం. అదే విధంగా వాటి ద్వారానే రైతులకు కూడా మేలు జరుగుతుంది. అందుకే గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే గ్రీన్‌కో, ఇండోసాల్, ఆర్సిలర్‌ మిట్టల్, అరవిందో, అదానీ వాళ్లకు ఈ మధ్య కాలంలోనే రూ.72,188 కోట్ల ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం. మరో మూడు, నాలుగేళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తవుతాయి. దాని వల్ల ఈ ప్రాంతంలోనే అక్షరాలా 20 వేల ఉద్యోగాలు వస్తాయి’’ అని సీఎం జగన్ వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.