ANGRAU Recruitment 2024 : టీచింగ్ అసిస్టెంట్, టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ - కేవలం ఇంటర్వ్యూనే..!
05 September 2024, 15:29 IST
- ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టీచింగ్ అసిస్టెంట్, టీచింగ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 13వ తేదీన ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఉద్యోగాల భర్తీ ANGRAU నోటిఫికేషన్
టీచింగ్ అసిస్టెంట్, టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (నంద్యాల) నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 13న ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూలు ద్వారానే డైరెక్ట్ భర్తీ ఉంటుంది. మొత్తం 14 పోస్టులు భర్తీ చేయగా, అందులో టీచింగ్ అసిస్టెంట్ 11 (కేటగిరీ-బీ), టీచింగ్ టీచింగ్ అసోసియేట్ 3 (కేటగిరీ-ఏ) పోస్టులు ఉన్నాయి. నంద్యాల అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, రెడ్డిపల్లి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, రామగిరి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, మడకశిర అగ్రికల్చరల్ పాలిటెక్నిక్‌ల్లో పోస్టింగ్ ఉంటుంది.
జీతం...అర్హతలు
టీచింగ్ అసోసియేట్ పోస్టుకు నెలవారీ వేతనం రూ.54 వేలు (పీహెచ్డీ చేసిన వారికి), రూ.49 వేలు (పీజీ చేసిన వారికి) అదనంగా హెచ్ఆర్ఏ ఉంటుంది. ఈ పోస్టులకు అర్హతలు అగ్రికల్చర్, అనుబంధ సబ్జెక్ట్‌ల్లో పీహెచ్డీ చేసి ఉండాలి. లేకపోతే అగ్రికల్చరల్, అనుబంధ సబ్జెక్ట్‌ల్లో పీజీ చేసి ఉండాలి. అలాగే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయో పరిమితి ఇంటర్వ్యూ నాటికి పురుషులకు 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు మించకూడదు.
టీచింగ్ అసిస్టెంట్ పోస్టుకు నెలవారీ వేతనం రూ.30 వేలు ఉంటుంది. ఈ పోస్టులకు అర్హతలు బీఎస్సీ అగ్రికల్చరల్, బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. వయో పరిమితి ఇంటర్వ్యూ నాటికి 35 ఏళ్ల మించకూడదు.
11 నెలల సర్వీస్ పూర్తి అయిన తరువాత టెర్మినేట్ చేస్తారు. అవసరం అనుకుంటే కొనసాగిస్తారు. అభ్యర్థులు ఇంటర్వ్యూకు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు పట్టుకుని వెళ్లాలి. అలాగే ఒక సెట్ సెల్ఫ్ అటెస్ట్డ్ కాపీలు ఉండాలి. ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులకు టీఏ, డీఏలు ఇవ్వబడవు. అభ్యర్థులు సర్టిఫికేట్లలో ఎటువంటి తప్పులైన ఉంటే సెలక్ట్ అయిన తరువాత కూడా అభ్యర్థిని టెర్మినేట్ చేస్తారు.
ఎటువంటి నోటీసు ఇవ్వకుండా.. ఎటువంటి కారణం చెప్పకుండా అభ్యర్థిని టెర్మినేట్ చేసే అధికారం సంస్థకు ఉంది. ఒకవేళ అభ్యర్థి ఉద్యోగం మానియాలనుకుంటే నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఇంటర్వ్యూ అయిన తరువాత ఫిజికల్ ఫిట్నెస్ కోసం మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ సెప్టెంబర్ 13న ఉదయం 10ః30 గంటలకు నంద్యాలలోని రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (ఆర్‌ఏఆర్‌ఎస్)లో ఆఫీసు ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్‌లో జరుగుతుంది.