తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  బాపట్ల బీచ్‌లో మునిగి ఇద్దరు యువకులు మృతి, మరో ఇద్దరు గల్లంతు

బాపట్ల బీచ్‌లో మునిగి ఇద్దరు యువకులు మృతి, మరో ఇద్దరు గల్లంతు

HT Telugu Desk HT Telugu

22 June 2024, 6:14 IST

google News
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా రామాపురం బీచ్ వద్ద సముద్రంలో మునిగి ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు.

బాపట్ల బీచ్ లో ఇద్దరు మృతి
బాపట్ల బీచ్ లో ఇద్దరు మృతి

బాపట్ల బీచ్ లో ఇద్దరు మృతి

బాపట్ల మండలం రామాపురం బీచ్ వద్ద సముద్రంలో మునిగి ఇద్దరు మృతి చెందారు. తేజ (21), కిశోర్ (22) అనే ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికి తీయగా, నితిన్ (22), అమూల్ రాజు (23) అనే మరో ఇద్దరు సముద్రంలో గల్లంతయ్యారు.

ఈ యువకులు ఏలూరు జిల్లా పెదవేగికి చెందిన వారిగా గుర్తించారు. పెదవేగి గ్రామానికి చెందిన నలుగురు యువకులు బాపట్ల రామాపురంలోని బీచ్ కు వెళ్లారు. సముద్రంలో స్నానం చేస్తుండగా నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉందని చీరాల డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తదుపరి వ్యాసం