తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Karthika Masam Special Buses : అనంత‌పురం జిల్లా నుంచి శైవ క్షేత్రాల‌కు 300 ప్రత్యేక బ‌స్సు స‌ర్వీసులు

Karthika Masam Special Buses : అనంత‌పురం జిల్లా నుంచి శైవ క్షేత్రాల‌కు 300 ప్రత్యేక బ‌స్సు స‌ర్వీసులు

HT Telugu Desk HT Telugu

04 November 2024, 21:33 IST

google News
  • Karthika Masam Special Buses : కార్తీక మాసం సందర్భంగా అనంతపురం జిల్లా నుంచి శైవ క్షేత్రాలకు 300 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. త్రిలింగ ద‌ర్శనం, అరుణాచ‌లంతో పాటు ఇత‌ర పుణ్య క్షేత్రాల‌కు ప్రత్యేక స‌ర్వీసులు న‌డుపుతున్నారు.

అనంత‌పురం జిల్లా నుంచి శైవ క్షేత్రాల‌కు 300 ప్రత్యేక బ‌స్సు స‌ర్వీసులు
అనంత‌పురం జిల్లా నుంచి శైవ క్షేత్రాల‌కు 300 ప్రత్యేక బ‌స్సు స‌ర్వీసులు

అనంత‌పురం జిల్లా నుంచి శైవ క్షేత్రాల‌కు 300 ప్రత్యేక బ‌స్సు స‌ర్వీసులు

కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని భ‌క్తుల సౌక‌ర్యార్థం శైవ క్షేత్రాల‌కు ప్రత్యేక బ‌స్సులు ఏర్పాటు చేసిన‌ట్లు అనంతపురం ఆర్టీసీ రీజిన‌ల్ మేనేజ‌ర్ సుమంత్ ఆర్ ఆదోని తెలిపారు. జిల్లాలోని వివిధ డిపోల నుంచి 300 బ‌స్సుల‌ను న‌డుతున్నట్లు వెల్లడించారు. త్రిలింగ ద‌ర్శనం, అరుణాచ‌లంతో పాటు ఇత‌ర పుణ్య క్షేత్రాల‌కు ప్రత్యేక స‌ర్వీసులు న‌డుపుతున్నారు.

అనంత‌పురం డిపో నుంచి 70 బ‌స్సు స‌ర్వీసులు

అనంత‌పురం డిపో నుంచి శ్రీశైలం మ‌ల్లికార్జున క్షేత్రానికి 24 బ‌స్సు స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్రిలింగ ద‌ర్శనం-1 (శ్రీశైలం, మ‌హానంది, ఓంకారం) 8 ప్రత్యేక బ‌స్సులు అందుబాటులోకి తెచ్చారు. త్రిలింగ ద‌ర్శనం-2 (బుగ్గ, యాగంటి, మ‌హానంది) 12 బ‌స్సులు న‌డ‌ప‌నున్నారు. అరుణాచ‌లం- ఆరు బ‌స్సులు, లేపాక్షి- 10 బ‌స్సులు, ఆలూరు కోన‌- 5 బ‌స్సులు, పొల‌త‌ల‌- 5 బ‌స్సులతో క‌లిపి 70 బ‌స్సులు ఏర్పాటు చేశామ‌న్నారు.

గుత్తి డిపో నుంచి ఆరు బ‌స్సు స‌ర్వీసులు

గుత్తి డిపో నుంచి త్రిలింగ ద‌ర్శనం-1కి రెండు బ‌స్సులు, త్రిలింగ ద‌ర్శనం-2కి నాలుగు బ‌స్సులు న‌డుపుతున్నారు.

గుంత‌క‌ల్లు డిపో నుంచి 26 బ‌స్సు స‌ర్వీసులు

గుంత‌క‌ల్లు నుంచి శ్రీ‌శైలం క్షేత్రానికి 12 బ‌స్సులు, త్రిలింగ ద‌ర్శనం-1కి 4 బ‌స్సులు, త్రిలింగ ద‌ర్శనం-2కి 8 బ‌స్సులు, అరుణాచలం-2 బ‌స్సుల‌తో క‌లిపి 26 బ‌స్సులు అందుబాటులోకి తెచ్చారు.

క‌ళ్యాణ‌దుర్గం నుంచి 38 బ‌స్సు స‌ర్వీసులు

క‌ళ్యాణ‌దుర్గం నుంచి శ్రీశైలానికి 24 బ‌స్సులు, త్రిలింగ ద‌ర్శ‌నం-1కి 4 బ‌స్సులు, త్రిలింగ ద‌ర్శనం-2కి ఎనిమిది బ‌స్సులు, అరుణాచలం రెండు బ‌స్సుల‌తో క‌లిపి 38 బ‌స్సులు అందుబాటులోకి తెచ్చారు.

రాయ‌దుర్గం నుంచి 48 బ‌స్సు స‌ర్వీసులు

రాయ‌దుర్గం నుంచి శ్రీశైలం-30 బ‌స్సులు, త్రిలింగ ద‌ర్శ‌నం-1కి నాలుగు బ‌స్సులు, త్రిలింగ ద‌ర్శనం-2కి 10 బ‌స్సులు, అరుణాచ‌లం-4 బ‌స్సుల‌తో క‌లిపి 48 బ‌స్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

తాడిప‌త్రి నుంచి 86 బ‌స్సు స‌ర్వీసులు

తాడిప‌త్రి నుంచి శ్రీశైలం-30 బ‌స్సులు, త్రిలింగ ద‌ర్శనం-1కి 8 బ‌స్సులు, త్రిలింగ ద‌ర్శనం-2కి 12 బ‌స్సులు, అరుణాచలం-6 బ‌స్సులు, ఆలూరు కోన‌-2, పొల‌త‌ల‌కు 10 బ‌స్సుల‌తో క‌లిపి 86 బ‌స్సులు అందుబాటులోకి తెచ్చారు.

ఉర‌వ‌కొండ నుంచి 26 బ‌స్సు స‌ర్వీసులు

ఉర‌వ‌కొండ నుంచి శ్రీ‌శైలం క్షేత్రానికి 12 బ‌స్సులు, త్రిలింగ ద‌ర్శనం-1కు 4 బ‌స్సులు, త్రిలింగ‌ ద‌ర్శనం-2కి ఎనిమిది బ‌స్సులు, అరుణాచ‌లం-2 బ‌స్సుల‌తో క‌లిపి మొత్తం 26 బ‌స్సులు అందుబాటులోకి తెచ్చారు. 50 మంది క‌లిసి గ్రూప్‌గా వెళ్తే ప్రత్యేకంగా బ‌స్సును ఏర్పాటు చేస్తున్నారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం