తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ias Transfers : ఏపీలో 21 మంది ఐఏఎస్ లు ట్రాన్స్ ఫర్, తిరుపతి కలెక్టర్ గా లక్ష్మీ షా నియామకం

AP IAS Transfers : ఏపీలో 21 మంది ఐఏఎస్ లు ట్రాన్స్ ఫర్, తిరుపతి కలెక్టర్ గా లక్ష్మీ షా నియామకం

28 January 2024, 22:49 IST

google News
    • AP IAS Transfers : ఏపీలో ఎన్నికల వేళ భారీగా బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా 21 మంది ఐఏఎస్ అధికారులను సీఎస్ బదిలీ చేశారు.
ఏపీ ఐఏఎస్ ల బదిలీలు
ఏపీ ఐఏఎస్ ల బదిలీలు

ఏపీ ఐఏఎస్ ల బదిలీలు

AP IAS Transfers : ఏపీలో ఎన్నికల దగ్గరపడుతుండడంతో అధికారుల బదిలీలు మొదలయ్యాయి. తాజాగా 21 మంది ఐఏఎస్ అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి బదిలీ చేశారు. 21 మంది ఐఏఎస్ ల బదిలీలు చర్చనీయాంశం అయ్యింది. శ్రీకాకుళం కలెక్టర్‌ బాలాజీరావును మున్సిపల్‌ అ‍డ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌గా సీఎస్ బదిలీ చేశారు. నంద్యాల కలెక్టర్‌ మంజీర్‌ జిలానీని శ్రీకాకుళం కలెక్టర్‌గా బదిలీ చేశారు. నంద్యాల కలెక్టర్‌గా ప్రకాశం జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు నియమితులయ్యారు. తిరుపతి కలెక్టర్‌గా లక్ష్మీ షా నియమితులయ్యారు. తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా బదిలీ అయ్యారు.

ఐఏఎస్ ల బదిలీల

  • అన్నమయ్య జిల్లా కలెక్టర్‌- అభిషిక్త్‌ కిశోర్‌
  • అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌- భావన
  • పార్వతీపురం జాయింట్‌ కలెక్టర్‌- డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌
  • విశాఖ జాయింట్‌ కలెక్టర్‌- మయూర్‌ అశోక్‌
  • ప్రకాశం జాయింట్‌ కలెక్టర్‌- రోనంకి గోపాలకృష్ణ
  • కాకినాడ జాయింట్‌ కలెక్టర్‌- ప్రవీణ్‌ ఆదిత్య
  • విజయనగరం జాయింట్‌ కలెక్టర్‌- కార్తీక్‌
  • నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్ - ఆదర్శ్‌ రాజేంద్రన్‌
  • శ్రీకాకుళం కమిషనర్‌- తమీమ్‌ అన్సారియా
  • డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌- రోనంకి కూర్మనాథ్‌
  • విశాఖ కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌- కేఎస్‌ విశ్వనాథం
  • పోలవరం ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌- ఇల్లకియా
  • సర్వే సెటిల్‌మెంట్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌- గోవిందరావు
  • ఏపీయూఎఫ్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌- హరిత.
  • తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌- అదితి సింగ్‌
  • పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజస్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శి- రేఖారాణి

తదుపరి వ్యాసం