తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group 2 Results : జూన్ లేదా జులైలో గ్రూప్-2 ఫలితాలు, గ్రూప్-1 వాయిదా పుకార్లు నమ్మొద్దు- గౌతమ్ సవాంగ్

APPSC Group 2 Results : జూన్ లేదా జులైలో గ్రూప్-2 ఫలితాలు, గ్రూప్-1 వాయిదా పుకార్లు నమ్మొద్దు- గౌతమ్ సవాంగ్

25 February 2024, 18:28 IST

google News
    • APPSC Group 2 Results : జూన్ లేదా జులైలో గ్రూప్-2 ఫలితాలు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్-1 పరీక్ష వాయిదా వదంతలు నమ్మొద్దని తెలిపారు.
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్

ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్

APPSC Group 2 Results : రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష(APPSC Group 2) ప్రశాంతంగా జరిగింది. మొత్తం 899 పోస్టులకు ఏపీపీఎస్సీ ఇవాళ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. పరీక్ష నిర్వహణ తీరును కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. గ్రూప్-2 పరీక్షకు 4,83,535 అభ్యర్థులు అప్లై చేసుకోగా 4,63,517 మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ నమోదు కాలేదన్నారు. కానీ చిత్తూరు జిల్లాలో ఫేక్‌ హాల్ టికెట్ తో వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. జూన్‌ లేదా జులైలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామన్నారు. అయితే గ్రూప్ -1 ప్రిలిమ్స్ వాయిదా పడుతుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంటర్ పరీక్షల వల్ల గ్రూప్-1 ప్రిలిమ్స్(Group 1) పరీక్షకు సెంటర్ల కొరత వచ్చే అవకాశం లేదన్నారు. మార్చి 17న గ్రూప్‌-1 పరీక్ష నిర్వహిస్తామని, వాయిదా వదంతులు నమ్మవద్దని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గ్రూప్ -2 ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. శ్రీకాకుకం జిల్లాలో కొంతమంది అభ్యర్థులు హాల్ టికెట్ లో అడ్రస్ సరిగా చూసుకోకపోవడం వలన సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారు. ఆలస్యం కారణంగా అభ్యర్థులను పోలీసులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. ఒక అడ్రెస్ కి బదులు వేరే అడ్రెస్ కి రావడంతో కొందరు అభ్యర్థులు గ్రూప్2 పరీక్షకు దూరమయ్యారు. నిరాశతో పరీక్ష రాయకుండానే ఇంటిముఖం పట్టారు.

మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్

మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్‌ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి డిస్క్రిప్టివ్‌ విధానంలో మెయిన్‌ నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు. మొత్తం 81 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

గ్రూప్-1 ఖాళీల వివరాలు

  • డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు-9
  • ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌-18
  • డీఎస్పీ (సివిల్‌)- 26
  • రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌-6
  • డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు-5
  • జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌- 4
  • జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్స్- 3
  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌- 2
  • జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌- 1
  • జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌-1
  • మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II-1
  • ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌- 1

ప్రిలిమ్స్ పరీక్ష విధానం

స్కీనింగ్ టెస్ట్ లో భాగంగా ముందు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 240 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పేపర్-1లో 120 మార్కులకు 120 ప్రశ్నలు, పేపర్-2లో 120 మార్కులకు 120 మార్కులు అడుగుతారు. ఒక్కో పేపర్ కు గం. 2 ల సమయం కేటాయిస్తారు. పేపర్-1లో పార్ట్-ఏలో హిస్టరీ అండ్ కల్చర్, పార్ట్-బిలో రాజ్యాంగం, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పార్ట్-సిలో ఏపీ, ఇండినయ్ ఎకానమీ, ప్లానింగ్, పార్ట్-డిలో జాగ్రఫి నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతినిస్తారు.

మెయిన్స్ పరీక్ష విధానం

మెయిన్స్ రాత పరీక్షలో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి. వీటితోపాటు లాంగ్వేజెస్ పేపర్లు తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. అయితే వీటిని క్వాలిఫైయింగ్ పరీక్షలుగా పరిగణిస్తారు. మొత్తం ఐదు పేపర్లలో ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ రాత పరీక్షను నిర్వహిస్తారు. మెయిన్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

తదుపరి వ్యాసం