APPSC Notifications : నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్, మరో 6 నోటిఫికేషన్లు విడుదల
10 February 2024, 19:43 IST
- APPSC Notifications : ఏపీపీఎస్సీ 33 పోస్టుల భర్తీకి 6 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో 18 పోస్టులు, రెవెన్యూ డివిజన్ ఆఫీసుల్లో 19 పోస్టులు, ఇతర శాఖల్లో పలు పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
APPSC Notifications : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనుంది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో ఎనలిస్ట్ గ్రేడ్-2 కింద 18 పోస్టులు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో 19 పోస్టులు టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ 7 పోస్టులు, మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో లైబ్రేరియన్ 4 పోస్టులు, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ 2 పోస్టులు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్- 1 పోస్టు, భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లలో పేర్కొంది. పోస్టుల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది.
రెవెన్యూ డివిజన్ లో 19 పోస్టులు
ఏపీలో కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో పోస్టుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో కార్యాలయంలో క్యాడర్ స్ట్రెంగ్త్ కింద 19 పోస్టులు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కొత్త రెవెన్యూ డివిజన్ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ముఖ్యమైన తేదీలు
- కాలుష్య నియంత్రణ మండలి ఎనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులు- మార్చి 19 నుంచి ఏప్రిల్ 8 వరకు
- మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ లైబ్రేరియన్ పోస్టులు- మార్చి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు
- టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు- మార్చి 21 నుంచి ఏప్రిల్ 10 వరకు
- అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు- మార్చి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు
- అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులు- ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 21 వరకు
- వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు- ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 21 వరకు
ఏపీ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. తాజాగా వివిధ పోస్టుల భర్తీకి 6 నోటిఫికేషన్లు జారీ చేసింది.
ఏపీ శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు
గత కొంతకాలంగా వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. అయితే జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేస్తున్నాయి ఆయా ప్రభుత్వ శాఖలు. ఇందులో భాగంగా తాజాగా రాజమహేంద్రవరంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయం నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనుంది. https://eastgodavari.ap.gov.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను పేర్కొన్నారు.
ముఖ్య వివరాలు:
- రిక్రూట్ మెంట్ ప్రకటన - మహిళా శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా.
- మొత్తం ఖాళీలు - 13
- ఉద్యోగాల పేరు - సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, పారా మెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సెలర్, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్ స్టాఫ్/ కుక్, సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్.
- అర్హత: డిగ్రీ, లా డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. పలు పోస్టులకు పని అనుభవం ఉండాలి.
- స్థానిక మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- వయోపరిమితి- 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
- దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్ విధానంలో ఇవ్వాలి.
- దరఖాస్తులు ప్రారంభం- ఫిబ్రవరి 7,2024.
- దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి 15,2024.(సాయంత్రం 5 గంటల లోపు)
- ఎంపిక విధానం - దరఖాస్తులను పరిశీలించి అర్హతగల వారిని ఇంటర్వూకు పిలుస్తారు.
- కలెక్టర్ ఛైర్మన్ గా ఉండే డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ఈ రిక్రూట్ మెంట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.
- పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా - జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లాకు పంపాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://eastgodavari.ap.gov.in/