APPSC JL Jobs 2024 : ఏపీ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు... దరఖాస్తులు ప్రారంభం - వివరాలివే
01 February 2024, 14:26 IST
- APPSC JL Recruitment 2024 Updates : ఏపీలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. జనవరి 31వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు అప్లికేషన్స్ కు గడువు ఉంది.
జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు
APPSC Junior Lecturer Recruitment 2024 News : ఏపీ ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా… మొత్తం 47 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ ప్రక్రియ మొదలైంది. జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కాగా… ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఏప్రిల్ లేదా మే మాసంలో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఉద్యోగాలు - జూనియర్ లెక్చరర్ (ఇంటర్ కాలేజీలు)
మొత్తం ఖాళీలు - 47
ఇంగ్లీష్: 09 పోస్టులు
తెలుగు: 02 పోస్టులు
ఉర్దూ: 02 పోస్టులు
సంస్కృతం: 02 పోస్టులు
ఒరియా: 01 పోస్టు
మ్యాథ్స్: 01 పోస్టు
ఫిజిక్స్: 05 పోస్టులు
కెమిస్ట్రీ: 03 పోస్టులు
బోటనీ: 02 పోస్టులు
జువాలజీ: 01 పోస్టు
ఎకనామిక్స్: 12 పోస్టులు
సివిక్స్: 02 పోస్టులు
హిస్టరీ: 05 పోస్టులు
అర్హత - ఎంఏ/ ఎంఎస్సీ/ఎంకామ్/బీఏ(ఆనర్స్)/ బీఎస్సీ(ఆనర్స్)/ బీకామ్ (ఆనర్స్) లేదా కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత రంగంలో ఏదైనా ఇతర సమానమైన పీజీ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి - 28.12.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తులు ప్రారంభం - జునవరి 31, 2024.
దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి 20, 2024.
ఫీజు వివరాలు - అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం- రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా ఎంపికచేస్తారు.
రాతపరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉండగా… రెండో పేపర్ సంబంధిత సబ్జెక్ట్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
రాతపరీక్ష తేది: ఏప్రిల్/మే, 2024లో ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్: https://psc.ap.gov.in/
IIT Tirupati Recruitment 2024: తిరుపతి ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. పలు విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. జనవరి 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… ఫిబ్రవరి 29వ తేదీతో గడువు ముగియనుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా… ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్య వివరాలను ఇక్కడ చూడండి…..
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి.
ఉద్యోగాలు - .అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (కాంట్రాక్ట్),
అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్
భర్తీ చేసే విభాగాలు - కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ డిపార్ట్ మెంట్.
అర్హతలు - సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉండాలి.
వయోపరిమితి - 44 ఏళ్ల లోపు ఉండాలి. పలు
దరఖాస్తు - ఆన్ లైన్
దరఖాస్తుల స్వీకరణ - 24 జనవరి 3024.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - 29 ఫిబ్రవరి 2024.
అధికారిక వెబ్ సైట్ - https://www.iittp.ac.in/
ఈమెయిల్ ఐడీ: facultyrmt_queries@iittp.ac.in
https://iittp.ac.in/recruitment ఈ లింక్ తో దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేయవచ్చు.