తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group 2 Key : నేడే గ్రూప్-2 ప్రాథమిక కీ విడుదల, 5 నుంచి 8 వారాల్లో ప్రిలిమ్స్ ఫలితాలు!

APPSC Group 2 Key : నేడే గ్రూప్-2 ప్రాథమిక కీ విడుదల, 5 నుంచి 8 వారాల్లో ప్రిలిమ్స్ ఫలితాలు!

26 February 2024, 16:33 IST

google News
    • APPSC Group 2 Key : గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని ఇవాళ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు కీని ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అనంతరం ఈ కీపై అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
గ్రూప్-2 ప్రాథమిక కీ విడుదల
గ్రూప్-2 ప్రాథమిక కీ విడుదల (pixabay)

గ్రూప్-2 ప్రాథమిక కీ విడుదల

APPSC Group 2 Key : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం(ఫిబ్రవరి 25)న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను(APPSC Group 2 Exam) నిర్వహించింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC)తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. అన్ని చోట్లా పరీక్ష ప్రశాంతగా జరిగినట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష (Screening Test) ఫలితాలను 5 - 8 వారాల్లో ప్రకటిస్తామని తెలిపింది. గ్రూప్-2 మెయిన్ ఎగ్జామినేషన్ ను జూన్/జులైలో నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ ను ఇవాళ ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రాథమిక కీని(Group 2 Key) అధికారిక వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/ లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మెయిన్స్ ఎప్పుడంటే?

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష(APPSC Group 2) ప్రశాంతంగా జరిగిందని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 899 పోస్టులకు ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ నమోదు కాలేదని గౌతమ్ సవాంగ్ తెలిపారు. కానీ చిత్తూరు జిల్లాలో ఫేక్‌ హాల్ టికెట్ తో వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. జూన్‌ లేదా జులైలో గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అయితే గ్రూప్ -1 ప్రిలిమ్స్ వాయిదా పడుతుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంటర్ పరీక్షల వల్ల గ్రూప్-1 ప్రిలిమ్స్(Group 1) పరీక్షకు సెంటర్ల కొరత వచ్చే అవకాశం లేదన్నారు. మార్చి 17న గ్రూప్‌-1 పరీక్ష నిర్వహిస్తామని, వాయిదా వదంతులు నమ్మవద్దని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

ఏపీపీఎస్సీ ఇతర నోటిఫికేషన్లు

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఇటీవల ఆరు నోటిఫికేషన్లు(APPSC Notifications) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనుంది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో ఎనలిస్ట్ గ్రేడ్-2 కింద 18 పోస్టులు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో 19 పోస్టులు టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ 7 పోస్టులు, మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో లైబ్రేరియన్ 4 పోస్టులు, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ 2 పోస్టులు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్- 1 పోస్టు, భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్-1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లలో పేర్కొంది. పోస్టుల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది.

ముఖ్యమైన తేదీలు

  • కాలుష్య నియంత్రణ మండలి ఎనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులు- మార్చి 19 నుంచి ఏప్రిల్ 8 వరకు
  • మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌ లైబ్రేరియన్ పోస్టులు- మార్చి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు
  • టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు- మార్చి 21 నుంచి ఏప్రిల్ 10 వరకు
  • అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు- మార్చి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు
  • అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులు- ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 21 వరకు
  • వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్‌ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు- ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 21 వరకు

తదుపరి వ్యాసం