Orders On AP Group 2 Exam: గుడ్ న్యూస్.. ఇక గ్రూప్ 2 మెయిన్స్‌లో రెండు పేపర్లే
Changes in AP Group 2 Exam: గ్రూప్ - 2 పరీక్షా విధానంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు పేపర్ల ద్వారా నిర్వహించే మెయిన్స్ పరీక్షను రెండింటికి కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AP Govt Orders On Group 2 Exam: గ్రూప్ 2 పరీక్షా విధానంలో కీలక మార్పులు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మెయిన్స్ లో మూడు పేపర్లు ఉండగా... ఇక నుంచి 2 పేపర్లు మాత్రమే ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఫలితంగా ఇప్పటివరకు గ్రూప్–2 మెయిన్స్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని రెండుకు కుదించినట్లు అయింది. పరీక్ష విధానం, సిలబస్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఏపీపీఎస్సీ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమోదిస్తూ ఏపీ సర్కార్ జీవో 6ను విడుదల చేసింది.
ఇప్పటివరకు గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్టును 150 మార్కులకు, మెయిన్స్ పరీక్షలను 450 మార్కులకు నిర్వహించేవారు. తాజా నిర్ణయంతో ఈ విధానం మారుతుంది. గతంలో మెయిన్స్‌లో పేపర్–1గా ఉన్న జనరల్ స్టడీస్‌ను రద్దు చేసి దాన్ని స్క్రీనింగ్ టెస్టుకు మార్చారు. దీన్ని గతంలో మాదిరిగానే 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇక మెయిన్స్‌లో రెండు పేపర్లు మాత్రం ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున 300 మార్కులు కేటాయించారు.
ఇలా ఉంటుంది..
స్క్రీనింగ్ టెస్ట్ - జనరల్ స్టడీస్ –మెంటల్ ఎబిలిటీ - 150మార్కులు
మెయిన్ పరీక్షలు
పేపర్–1: (150మార్కులు)
సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ దఇండియన్ కాన్‌స్టిట్యూషన్
పేపర్–2: (150మార్కులు)
ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ
సైన్స్ అండ్ టెక్నాలజీ
గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న 92 పోస్టులకు అదనంగా మరో 19 పోస్టులను కలుపుతున్నట్లు ప్రకటించింది.