తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cid Charge Sheet On Chandrababu : రూ.4400 కోట్ల కుంభకోణం, ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు- సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు

CID Charge Sheet On Chandrababu : రూ.4400 కోట్ల కుంభకోణం, ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు- సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు

11 March 2024, 19:39 IST

    • CID Charge Sheet On Chandrababu : ఎన్నికల ముందు ఏపీ సీఐడీ చంద్రబాబు షాక్ ఇచ్చింది. అమరావతి అసైన్డ్ ల్యాండ్స్ స్కామ్ లో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
 చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు
చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు

చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు

CID Charge Sheet On Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్(AP CID Charge Sheet) దాఖలు చేసింది. అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ లో సీఐడీ చంద్రబాబుపై(Chandrababu) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రాజధాని ప్రాంతంలో మొత్తం రూ.4400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం(Amaravati Land Scam) జరిగిందని సీఐడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ స్కామ్ లో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా తెలిపింది. మాజీ మంత్రి నారాయణను మరో ముద్దాయిగా ఛార్జ్‌షీట్‌లో సీఐడీ పేర్కొంది. అమరావతిలో 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిని సీఐడీ ఛార్జ్ షీట్ లో తెలిపింది. అమరావతి రాజధాని ప్రాంతాంలో చంద్రబాబు, నారాయణ(Narayana) సహా మరికొందరు భారీగా భూదోపిడీకి పాల్పడినట్లు సీఐడీ అభియోగించింది. చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములను కాజేశారని సీఐడీ(CID) పేర్కొంది. భూరికార్డులను ట్యాంపరింగ్ చేసి భూముల కుంభకోణానికి పాల్పడినట్లు సీఐడీ నిర్ధారించిది. చంద్రబాబు, నారాయణతో పాటు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ను సీఐడీ ముద్దాయిలుగా పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

AP Inter Supply Hall Tickets : మే 24 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఇవాళే హాల్ టికెట్లు!

AP Aarogya Sri : ఏపీలో మే 22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్, స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రకటన

Mangalagiri SI: పోస్టల్ బ్యాలెట్‌కు డబ్బులు తీసుకున్న మంగళగిరి ఎస్సై సస్పెన్షన్, రాజకీయ కుట్రగా ఆరోపిస్తోన్న ఎస్సై

AP Bureaucrats: ఏపీలో అంతే.. ఫేస్‌బుక్‌లో హీరోలు,విధుల్లో జీరోలు,పేలవమైన పనితీరు

చంద్రబాబు, నారాయణ బినామీలతో కలిసి కుట్ర

అమరావతి రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూములను(Assigned Lands) ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి బలవంతంగా లాక్కోవాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ(Narayana)ఇతర మంత్రులు, వారి బినామీలతో కలిసి కుట్ర చేశారని సీఐడీ అభియోగించింది. అసైన్డ్ భూయజమానులను భయపెట్టి ఆ భూములను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ కింద ఎలాంటి ప్యాకేజీ ప్రకటించకుండా తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారని పేర్కొంది. మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లోని అసైన్డ్ భూములకు ల్యాండ్ పూలింగ్ (Land Pooling)కింద లబ్ధి చేకూర్చేందుకు జీఓలు 41 జారీ చేశారని తెలిపింది. అప్పటి అడ్వకేట్ జనరల్ సలహా ఇచ్చినా నిందితులు ఉద్దేశపూర్వకంగా భూములు లాక్కున్నారని అభియోగించింది. తమ ప్లాన్ ప్రకారం అప్పటి మంత్రులకు బినామీలుగా వ్యవహరించిన కొందరు పేదల అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని సీఐడీ పేర్కొంది.

బినామీ పేర్లతో వందల ఎకరాలు

కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి, కేపీవీ అంజనీకుమార్, గుమ్మడి సురేష్, కొల్లి శివరాం, మంత్రుల కుటుంబ సభ్యులు కొందరు ఇలా కొనుగోలు చేసిన వారిలో ఉన్నారని సీఐడీ ఛార్జ్ షీట్(CID Charge Sheet) లో తెలిపింది. నిషేధిత జాబితాలోని అసైన్డ్ భూములపై రిజిస్ట్రేషన్లు, GPAలను అనుమతించమని మంగళగిరిలోని సబ్-రిజిస్ట్రార్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని తెలిపింది. దీనిపై మేజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 Cr.PC కింద కేసు నమోదు చేశామని పేర్కొంది. మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, కంపెనీల నుంచి ఎం/ఎస్‌ రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఇతర రియల్‌ ఎస్టేట్‌ మధ్యవర్తులతో రైతులకు చెల్లించిన దాదాపు రూ.16.5 కోట్లకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించాయని తెలిపింది. నారాయణ తన బినామీల పేర్లతో అసైన్డ్ భూములు, అక్రమంగా విక్రయ ఒప్పందాలు చేసుకున్నారని చెప్పింది. దాదాపు 162 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారని సీఐడీ అభియోగించింది. చంద్రబాబు, నారాయణలకు రాజకీయంగా అనుబంధం ఉన్న మరికొందరు కూడా రాజధాని ప్రాంతంలో వందల ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని సీఐడీ ఛార్జ్ షీట్ లో తెలిపింది.

తదుపరి వ్యాసం