తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Camp Office At Visakha : విశాఖకు షిఫ్టింగ్ స్టార్ట్, సీఎం క్యాంపు ఆఫీసు ఏర్పాటుకు కమిటీ!

CM Camp Office At Visakha : విశాఖకు షిఫ్టింగ్ స్టార్ట్, సీఎం క్యాంపు ఆఫీసు ఏర్పాటుకు కమిటీ!

11 October 2023, 22:16 IST

google News
    • CM Camp Office At Visakha : విశాఖకు పాలన రాజధాని తరలింపులో ప్రభుత్వ అధికారంగా తొలి అడుగు వేసింది. విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు, మంత్రుల వసతిపై కమిటీని నియమించింది.
విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్
విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్

విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్

CM Camp Office At Visakha : పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. త్వరలోనే సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారని మంత్రులు తరచూ అంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారంగా తొలి అడుగు పడింది. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రుల వసతిపై ప్రభుత్వం కమిటీని నియమించింది. సీనియర్‌ అధికారులకు ట్రాన్సిట్‌ వసతి గుర్తింపునకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షలపై విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం గుర్తింపునకు పురపాలక, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సీఎస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం

విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, మంత్రులకు వసతి ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్, సాధారణ పాలన కార్యదర్శితో కమిటీని ఏర్పాటుచేసింది ప్రభుత్వం. ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటుతనం, వామపక్ష తీవ్రవాద రిస్క్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబాటుతనం పొగొట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎస్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల్లో మరింత విస్తృతం చేసేందుకు సీఎం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు క్యాంపు కార్యాలయం ఉత్తరాంధ్రలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉన్నతాధికారులతో తరచూ క్షేత్ర స్థాయి పర్యటనలు, సమీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. సీఎం జగన్ కూడా తరచూ పర్యటనలు, సమీక్షలు, రాత్రి బస చేస్తారని, ఈ నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని సీఎస్ తెలిపారు. మంత్రులు, అధికారుల ట్రాన్సిట్ వసతి గుర్తింపు కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం