తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Schools : 'నేను బడికి పోతా' ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం, జులై 12 లోపు బడి మానేసి పిల్లలు మళ్లీ బడికి

AP Schools : 'నేను బడికి పోతా' ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం, జులై 12 లోపు బడి మానేసి పిల్లలు మళ్లీ బడికి

HT Telugu Desk HT Telugu

19 June 2024, 15:58 IST

google News
    • AP Schools : డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ఏపీ విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేను బడికి పోతా కార్యక్రమాన్ని చేపట్టింది. జులై 12లోపు బడి మానేసిన పిల్లలు గుర్తించి తిరిగి బడిలో చేర్పించాలని నిర్ణయించింది.
'నేను బడికి పోతా' ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం
'నేను బడికి పోతా' ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం

'నేను బడికి పోతా' ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం

AP Schools : ఏపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు 'నేను బడికి పోతా' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. "పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు...బడిలో ఉండాలి. రండి 'నేను బడికి పోతా' కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వండి. జులై 12 లోపు బడి మానేసిన పిల్లలను గుర్తించి మళ్లీ బడిలో చేర్పిద్దాం" అంటూ కార్యక్రమాన్ని ప్రకటించింది. రాష్ట్ర విద్యా శాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

"గ్రామాల్లో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించటం. గ్రామ వాలంటీర్ల సహాయంతో ఆ పిల్లలను బడిలో చేర్పించటం. స్టూడెంట్ కిట్ ఇతర విద్యా ప్రోత్సాహకాలు అందించటం. నూతనంగా బడిలోకి చేరిన పిల్లల సామర్థ్యాలు మదింపు చేయటం. వయస్సుకు తగిన తరగతిలోకి చేర్చి. ఆ తరగతి స్థాయి అందుకునేందుకు బ్రిడ్జ్ కోర్సును ఉపయోగించడం. బడి ఈడు పిల్లలందరినీ బడిలోకి చేర్చి బడి బయట పిల్లలు లేని గ్రామంగా ప్రకటించటం" అంటూ సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్

ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి నోడల్ ఆఫీసర్ ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం తెలుగు అకాడమీ నుంచి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు సరఫరా చేయనుంది. ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ టూ లో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్‌గా సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్ట్ బి.శ్రీనివాసరావును నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం