తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bc Welfare Schools: ఏపీ బీసీ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు… మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌‌లో అప్లికేషన్లు

BC Welfare Schools: ఏపీ బీసీ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు… మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌‌లో అప్లికేషన్లు

Sarath chandra.B HT Telugu

15 February 2024, 8:13 IST

google News
    • BC Welfare Schools: ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్‌ ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
బీసీ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ నోటిఫికేషన్
బీసీ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ నోటిఫికేషన్

బీసీ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ నోటిఫికేషన్

BC Welfare Schools: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తోన్న మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తోన్న పాఠశాలల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది.

2024-25 విద్యా సంవత్సరంలో 5వ(5th class) తరగతితో పాటు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న మహాత్మ జ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ ద్వారా 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ (first Inter) ఇయర్‌ అడ్మిషన్లు కల్పిస్తారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం బాలబాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

అర్హులైన విద్యార్ధులు 2024 మార్చి 1 నుంచి మార్చి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీని కోసం బీసీ వెల్ఫేర్ సంస్థ వెబ్‌సైట్‌ https://mjpapbcwreis.apcfss.in/ లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయాలనుకునే విద్యార్ధులు సమీపంలోని ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లోని జిల్లా సమన్వయకర్తల్ని సంప్రదించాల్సి ఉంటుంది.

పరీక్ష తేదీలు...

5వ తరగతిలో ప్రవేశం కోసం ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఏప్రిల్ 27వ తేదీ ఉదయం పది గంటల నుంచి 12గంటల వరకు నిర్వహిస్తారు.

జూనియర్ ఇంటర్ ప్రవేశాల కోసం ఏప్రిల్ 13వ తేదీ ఉదయం పది గంటల నుంచి 12.30వరకు పరీక్ష నిర్వహిస్తారు.

ఏపీ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ తేదీలు…

ఆంధ్రప్రదేశ్ లోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించి కామన్ ఎంట్రన్స్ పరీక్షల(AP CETs) తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కేసుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఏపీ ఈఏపీ సెట్ (AP EAPCET 2024) ను మే 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు.

కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీలు

ఏపీ ఐసెట్(AP ICET) - మే 6న

ఏపీ ఈసెట్(AP ECET) - మే 8న

ఏపీ పీజీఈసెట్(AP PGECET)- మే 29 నుంచి 31 వరకు

ఏపీ పీజీసెట్(AP PGCET)- జూన్ 3 నుంచి 7 వరకు

ఏపీ ఎడ్ సెట్(AP EdCET)- జూన్ 8న

ఏపీ లాసెట్(AP LAWCET) - జూన్ 9న

ఏపీ ఏడీసెట్(AP ADCET)- జూన్ 13న

ఏ సెట్ ఏ యూనివర్సిటీ నిర్వహణ

వచ్చే విద్యా సంవత్సరానికి(2024-25) ప్రవేశ పరీక్షల తేదీలు, నిర్వహించే యూనివర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఏపీ ఈఏపీ సెట్ ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహించనుంది. ఏపీ ఈసెట్(ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ను అనంతపురం జేఎన్టీయూ, ఐసెట్(ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలు)ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహించనుంది. వెంకటేశ్వర యూనివర్సిటీ పీజీఈసెట్, ఆంధ్ర యూనివర్సిటీ (Andhra Univesity) ఎడ్ సెట్‌ను, నాగార్జున యూనివర్సిటీ లా సెట్ ను నిర్వహించనున్నాయి. పీజీ సెట్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం, పీఈ సెట్‌ను నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించనున్నాయి. ఏపీ ఎడ్ సెట్‌ను వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

తదుపరి వ్యాసం