Actress Khushbu: రోజాపై బండారు వ్యాఖ్యల్ని ఖండించిన నటి ఖుష్బూ
06 October 2023, 12:27 IST
- Actress Khushbu: ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను నటి ఖుష్బూ ఖండించారు. బండారు తక్షణం తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండారు చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడాలన్నారు.
ఖుష్బూ సుందర్
Actress Khushbu: మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యల పై సినీ నటి ఖుష్బూ స్పందించారు. బండారు వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాట్లు ప్రకటించారు. రోజాకు పూర్తి మద్దతు తెలిపిన ఖుష్బూ.. రోజాకు బండారు క్షమాపణ చెప్పే వరకు పోరాడుతానన్నారు.
బండారు సత్యానారయణ రాజకీయ నాయకుడి గానే కాదు మనిషిగా కూడా విఫలమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారీ శక్తి వంటి చట్టాలను దేశంలో తెచ్చుకుంటున్న సందర్భంలో చౌకబారు ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. కొంతమంది మహిళల గురించి నీచంగా మాట్లాడటం తమ జన్మ హక్కు అనుకుంటున్నారని, బండారు సత్యనారాయణమూర్తి వంటి వ్యక్తులను ఉపేక్షించకూడదన్నారు.