Tirumala Accident: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. యువతి మృతి
12 January 2024, 13:12 IST
- Tirumala Accident: తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన యువతి మృతి చెందింది.
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
Tirumala Accident: తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది.ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళను గుంటూరు జిల్లాకు చెందిన జ్యోతిగా పోలీసులు గుర్తించారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 16వ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న జ్యోతి అనే యువతి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
జ్యోతిని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతురాలు దాసరి జ్యోతి గుంటూరు జిల్లా మాచర్లలోని ఎర్రగడ వీధికి చెందినట్టు పోలీసులు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలిపారు.